ఆస్కార్ బరిలో సూర్య ప్లాప్ సినిమా! ప్రపంచ ప్రఖ్యాత సినిమా అవార్డ్స్ లలో ఒకటైన ఆస్కార్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఎప్పటిలానే ఈ ఏడాది కూడా 97వ అకాడమీ అవార్డ్స్ వేడుక ఘనంగా జరగబోతుంది ఈ క్రమంలో అనేక దేశాల నుంచి ఎన్నో విభాగాల్లో పలు చిత్రాలు పోటీకి సిద్దంగా ఉన్నాయి.
అయితే మన నుంచి కూడా ఫెడరేషన్ తరపున పలు చిత్రాలు వెళ్లినప్పటికీ వాటికి ఆస్కార్ బరిలో అఫీషియల్ ఎంట్రీ అందలేదు. మరి మన దేశంలో ఫెడరేషన్ తరపు నుంచి కాకుండా కొన్ని సినిమాలు మాత్రం ఎలిజిబుల్ లిస్ట్ లో చోటు సంపాదించుకున్నాయి. మరి ఈ మూవీల్లో సూర్య నటించిన భారీ చిత్రం కంగువా అలాగే మళయాళ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ నటించిన ది గోట్ లైఫ్(ఆడు జీవితం) అలాగే మరో నాలుగు సినిమాలు ఇండియా నుంచి లిస్ట్ లో నిలిచాయి.
అయితే ఆ చిత్రాలు హిందీ నుంచి ‘సంతోష్’ అలాగే మరో మూవీ “స్వాతంత్య్ర వీర్ సావర్కర్” అలాగే మళయాళ సినిమా నుంచి “ఆల్ వి ఇమాజిన్ ఏస్ లైట్” అలాగే “గర్ల్స్ విల్ బి గర్ల్స్” లు నిలిచాయి. అయితే రేపు జనవరి 8 నుంచి ఓటింగ్స్ మొదలవుతుండగా వీటిలో ఏవి చివర వరకు వెళ్తాయో చూడాల్సిందే.
The post ఆస్కార్ బరిలో సూర్య ప్లాప్ సినిమా! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
