ప్రభాస్ ఈ లుక్ లోకేష్ కోసమేనా! పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇపుడు చేతినిండా భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు.మరి ఈ సినిమాల్లో తన నుంచి “సలార్” నిర్మాణ సంస్థ నుంచి మూడు భారీ సినిమాలు లాక్ చేసి పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీస్ లో స్ట్రాంగ్ బజ్ ఒక ఊహించని కాంబో పై కూడా ఉంది. అదే కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, ప్రభాస్ మూవీ.
మరి ఈ భారీ కాంబో గురించి ఎప్పటి నుంచో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కానీ అఫీషియల్ గా మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఎప్పుడైతే హోంబళే వారు ప్రభాస్ తో మూడు సినిమాలు ప్రకటించారో వాటిలో కచ్చితంగా ఒకటి లోకేష్ కనగరాజ్ తో సినిమానే అని స్ట్రాంగ్ రూమర్స్ వినిపించాయి. మరి ఈ అవైటెడ్ సెన్సేషనల్ కాంబినేషన్ ఈ సంక్రాంతి కానుకగా ప్రకటించవచ్చిని పలు మాటలు వినపడుతున్నాయి.
మరి తాజా గానే ప్రభాస్ కొత్త లుక్ లోకి వచ్చిన సంగతి కూడా తెలిసిందే. వింటేజ్ లుక్స్ లో ప్రభాస్ నుంచి రీసెంట్ గా వచ్చిన ఓ వీడియో బైట్ వైరల్ అయ్యింది. మరి లోకేష్ కనగరాజ్ నుంచి ప్రకటన అంటే ఒక వీడియోతో వదులుతాడని తెలిసిందే. “విక్రమ్”, మొన్న “కూలీ” లాంటి సినిమాలకి కూడా కమల్, రజినీకాంత్ లపై వారి లుక్స్ ని రివీల్ చేసే వీడియోస్ వదిలాడు. మరి ఇది కూడా అలాంటి ప్లానింగేనా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
The post ప్రభాస్ ఈ లుక్ లోకేష్ కోసమేనా! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
