అదిరిందయ్యా…అక్కినేని యంగ్ హీరోస్ ఫ్యామిలీ క్లిక్ అక్కినేని వారింట్లో కొద్ది రోజుల క్రితమే అక్కినేని యువ వారసుడు నాగ చైతన్య నటి శోభిత ధూళిపాళతో కలిసి కొత్త జీవితంలోకి అడుగు పెట్టాడు. అఖిల్ కూడా మరికొద్ది రోజుల్లో వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నాడు.
దీంతో అక్కినేని ఇంట వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. అక్కినేని కుటుంబం నుంచి ఇంకా చాలా మంది యువ హీరోలు ఉన్న విషయం తెలిసిందే. సుశాంత్, సుమంత్ ఇంకా అఖిల్ లు కూడా తమ సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా సుశాంత్ ఓ బ్యూటిఫుల్ పిక్ ని షేర్ చేసుకున్నాడు. మరి ఇందులో తాను అలాగే సుప్రియ, నాగ చైతన్య, ఆయనభార్య శోభిత అక్కినేని, సుశాంత్ తో పాటు ఇంకా తమ యువ కుటుంబీకులు కలిసి ఉన్న పిక్ ఇపుడు వైరల్ అవుతుంది.
మరి ఇందులో వీరంతా మంచి హ్యాపీ మూమెంట్ లో చాలా సింపుల్ గా కనపడుతున్నారు. ఇక నాగ చైతన్య తన కెరీర్ భారీ చిత్రం “తండేల్” తో బిజీగా ఉండగా ఈ చిత్రం ఈ ఫిబ్రవరి 7న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి సిద్దంగా ఉంది. అలాగే ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
The post అదిరిందయ్యా…అక్కినేని యంగ్ హీరోస్ ఫ్యామిలీ క్లిక్ first appeared on Andhrawatch.com.