అప్పన్న పై ఓ సినిమా తీస్తే! | CineChitram

అప్పన్న పై ఓ సినిమా తీస్తే! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లు గా మార్వలెస్ డైరెక్టర్‌ శంకర్ తెరకెక్కించిన మోస్ట్‌ అవైటెడ్ మూవీ “గేమ్ ఛేంజర్”. ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్ పై మరోసారి మంచి ప్రశంసలు అందాయి.

తన డైనమిక్ ప్రెజెన్స్ తోనే కాకుండా నటనలో కూడా మళ్ళీ రంగస్థలం తర్వాత మంచి మార్కులు తాను దక్కించుకున్నాడు. ఇలా గేమ్ ఛేంజర్ లో తాను చేసిన అప్పన్న పాత్రపై చాలా ప్రశంసలు కురుస్తున్నాయి. ఆ పాత్రలోని అమాయకత్వం, భావోద్వేగాలని పండించడంలో రామ్ చరణ్ మళ్ళీ అందరినీ ఊహించని విధంగా ఆకట్టుకున్నాడు.

దీంతో చాలా మందిలో అప్పన్న పాత్రపై ఒక సోలో సినిమా వచ్చినా బాగుంటుంది అని అనుకుంటున్నారు. అలాగే సినిమాలో కూడా అప్పన్న ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఇంకా ఉన్నా బాగున్ను అన్ని కూడా చాలా మంది అనుకుంటున్నారు. సో ఇలా అప్పన్న పాత్ర వరకు ఒక సోలో సినిమా వచ్చినా కూడా అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా చూసేందుకు ఆసక్తిగా ఉన్నారని తెలుస్తుంది.

The post అప్పన్న పై ఓ సినిమా తీస్తే! first appeared on Andhrawatch.com.

About

Check Also

Love Song From Kannappa Out Now – Vishnu Manchu And Preethi Mukundan Shine | CineChitram

Vishnu Manchu’s magnum opus Kannappa is shaping up to be one of his most ambitious …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading