పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా చేస్తున్న మూవీస్ లో భారీ హైప్ ఉన్న వన్ అండ్ ఓన్లీ సినిమా ఏదన్నా ఉంది అంటే అది “ఓజి” అనే చెప్పుకోవాలి. ప్రకటించిన రోజు నుంచి ఇప్పుడు వరకు ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయే తప్ప తగ్గే సీన్ కనిపించడం లేదు. అయితే ఈ సినిమా విషయంలో థమన్ చేసిన కామెంట్స్ ఇపుడు భారీ రేంజ్ లో హైప్ ఇస్తున్నాయి.
మీసం తిప్పి మరీ చెప్తున్నాను ఓజి సినిమా అన్నిటికీ సమాధానం చెబుతుందని తను చాలా నమ్మకంగా చెబుతున్నాడు. తమిళ్ సినిమా నుంచి లియో, బీస్ట్, విక్రమ్, జైలర్ లాంటి సినిమాలు ఎలాగో వాటి అన్నిటికీ సమాధానం ఇచ్చేలా ఓజీ ఉంటుందని సాలిడ్ కామెంట్స్ చేసాడు.
అలాగే వాళ్ళ సినిమాలు కోసం మనం ఎలా ఎదురు చూస్తూ మాట్లాడుకుంటామో ఓజి కోసం మిగతా వాళ్ళు అలా మాట్లాడుకునే రేంజ్ లో ఉంటుంది అని థమన్ ఓ రేంజ్ లో హైప్ పెంచేశాడు.
మరి ఈ సినిమాను ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా వచ్చాక ఊచకోత ఎలా ఉంటుందో ఎదురు చూడాల్సిందే.
The post అన్నిటికి సమాధానం ఓజీనే! first appeared on Andhrawatch.com.