పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమాల్లో డైరెక్టర్ జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి రూపొందించిన భారీ పాన్ ఇండియా మూవీ “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. అయితే చాలా కాలం తర్వాత ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మళ్ళీ పాట పాడినట్లు తెలుస్తుంది. మాట వినాలి అంటూ నేడు మేకర్స్ ఈ పాటని విడుదల చేశారు.
మరి ఈ పాట తో మళ్ళీ చాలా కాలం తర్వాత పవన్ మార్క్ ఫోక్ సాంగ్ తో ట్రీట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. కీరవాణి స్లో మ్యూజిక్ తో పవన్ కళ్యాణ్ తెలంగాణ యాసలో అదరగొట్టేశారని చెప్పుకోవచ్చు. అలాగే పెంచల్ దాస్ సాహిత్యానికి పవన్ మార్క్ రిథమ్ తో ఇంపుగా ఉంది.
అయితే ఇందులో సాంగ్ తో పాటుగా పవన్ లుక్స్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయని చెప్పాలి.దీంతో పాటుగా బ్యాక్గ్రౌండ్ విజువల్స్ కూడా సాలిడ్ నిర్మాణ విలువలతో కనిపిస్తున్నాయి. ఇలా పాట గానే కాకుండా విజువల్ గా కూడా ఇంప్రెస్ చేసింది.
ఇక ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. అలాగే ఏ ఎం రత్నం నిర్మాణం వహిస్తున్నారు.
The post విజువల్ ట్రీట్ ఇస్తున్న “వీరమల్లు” ఫస్ట్ సింగిల్! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
