ఏంటి అలా ఉండబోతుందా? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా సినిమా ‘పుష్ప 2’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులతో ‘పుష్ప 2’ మరో రికార్డు క్రియేట్ చేసింది. అయితే, ఈ సినిమా తర్వాత బన్నీ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడా అనే ఆసక్తి అందరిలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, అల్లు అర్జున్ తన నెక్స్ట్ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయడానికి రెడీ అవుతున్నాడు. గతంలో వీరి కాంబోలో హ్యాట్రిక్ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు మరోసారి వీరి కాంబో సెట్ అయ్యిందని.. దీనికి సంబంధించి త్వరలోనే ఓ అనౌన్స్మెంట్ కూడా రాబోతుందని వార్తలు వినపడుతున్నాయి. అయితే, ఈ అనౌన్స్మెంట్ ఓ వీడియో రూపంలో రాబోతుందని తెలుస్తోంది. దీంతో త్రివిక్రమ్, బన్నీ కాంబోలో రాబోయే నెక్స్ట్ మూవీకి సంబంధించిన ప్రకటన ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
The post ఏంటి అలా ఉండబోతుందా? first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
