టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా యంగ్ అండ్ టలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల రూపొందిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “రాబిన్ హుడ్” గురించి అందరికీ తెలిసిందే. నితిన్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ సినిమా నిజానికి గత ఏడాదిలోనే విడుదల కావాల్సి ఉంది కానీ ఈ ఏడాదికి మేకర్స్ షిఫ్ట్ చేశారు.
ఇక ఈ సినిమా నుంచి తాజాగా సాలిడ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.ఈ చిత్రంలో “ఆదిపురుష్” సినిమాలో భజరంగ్ పాత్రలో కనిపించిన బాలీవుడ్ నటుడు దేవదత్త జి నాగ్ విలన్ రోల్ చేస్తున్నట్టుగా తనపై సాలిడ్ పోస్టర్ ని మేకర్స్ ఇపుడు తన పుట్టినరోజు కానుకగా విడుదల చేశారు.
మరి ఈ సరికొత్త లుక్ లో ఈ నటుడు మంచి డైనమిక్ గా కనిపిస్తుండగా తాను సామి అనే రోల్ లో కనిపించనున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. మరి ఇటీవల మరో తెలుగు సినిమా “దేవకీ నందన వాసుదేవ” సినిమాలో కూడా విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక రాబిన్ హుడ్ లో తాను ఎలా నటిస్తాడో చూడాలి.
The post “రాబిన్ హుడ్” నుంచి అదిరిన “ఆదిపురుష్” నటుడు పోస్టర్! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
