గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా సినిమా “గేమ్ ఛేంజర్” తాజాగానే ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో తన కెరీర్ 16వ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇపుడు షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉండగా మేకర్స్ హైదరాబాద్ లో సినిమా సన్నివేశాలు రూపొందిస్తున్నారు.
అయితే ఈ చిత్రంలో ఫేమస్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ నటుడు దివ్యెందు శర్మ కూడా ఉన్న విషయం తెలిసిందే. మరి అనౌన్సమెంట్ తోనే సాలిడ్ రెస్పాన్స్ ని తాను అందుకోగా తాజాగా తాను సినిమా సెట్స్ లో అడుగు పెట్టినట్టుగా తెలుస్తుంది. అలాగే రామ్ చరణ్ తో కూడిన సీన్స్ లోనే పాల్గొన్నట్టుగా టాక్. అయితే ఈ సినిమాలో మున్నాభాయ్యా నెగిటివ్ షేడ్ లో కనిపిస్తాడని తెలుస్తుంది.
మరి చూడాలి ఈ క్రేజీ కలయికలో సినిమా ఎలా ఉంటుందో అనేది.
The post చెర్రీ మూవీ సెట్స్ లోకి మున్నా భయ్యా first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
