ఆ ఐకానిక్‌ పాత్రలో చైతూ! | CineChitram

ఆ ఐకానిక్‌ పాత్రలో చైతూ! తెలుగు సినీ చరిత్రలో ఎన్నో ఐకానిక్ పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే శాశ్వతంగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. అలాంటి వాటిలో లెజెండరీ యాక్టర్‌ అక్కినేని నాగేశ్వర్ రావు నటించిన ‘తెనాలి రామకృష్ణ’ పాత్ర కూడా ఓ పాత్ర. ఆ పాత్రలో అక్కినేని నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. అయితే, ఇప్పుడు ఈ ఐకానిక్ పాత్రలో ఆయన మనవడు నాగచైతన్య కనిపించనున్నట్లు తెలుస్తుంది. అక్కినేని నాగచైతన్య నటించిన తాజా బ్లాక్‌బస్టర్ మూవీ ‘తండేల్’ మూవీ సక్సెస్ మీట్‌ను తాజాగా ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్‌కు అక్కినేని నాగార్జున అతిథిగా వచ్చి చిత్ర యూనిట్‌ కు అభినందనలు తెలిపారు. ఇక ఈ సక్సెస్ మీట్‌లో దర్శకుడు చందూ మొండేటి అక్కినేని అభిమానులకు ఓ సాలిడ్ ప్రకటన చేశాడు. తాను చైతూతో తెనాలి రామకృష్ణ హిస్టారిక్ చిత్రాన్ని తీయబోతున్నానని.. దీని కోసం తాను పక్కా ప్లానింగ్‌తో వస్తానని ఆయన చెప్పుకొచ్చాడు. తెనాలి రామకృష్ణ పాత్రను తనదైన స్టైల్‌లో ప్రెజంట్ చేస్తానని చందూ మొండేటి వివరించాడు.

The post ఆ ఐకానిక్‌ పాత్రలో చైతూ! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …