కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ఇపుడు దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబినేషన్ లో భారీ చిత్రం “టాక్సిక్” చేస్తున్న సంగతి తెలిసిందే. కేజీయఫ్ లాంటి పాన్ ఇండియా హిట్స్ తర్వాత వస్తున్న సినిమా ఇది కావడంతో దీనిపై కూడా గట్టి అంచనాలు ఉన్నాయి. అయితే అనౌన్సమెంట్ ఇచ్చిన హైప్, మొన్న వచ్చిన గ్లింప్స్ అందుకోలేదు అని చెప్పాలి. ఫ్యాన్స్ కూడా ఏదో వైలెంట్ గా ఆశిస్తే మేకర్స్ రొమాంటిక్ ట్రీట్ ఇచ్చి సరిపెట్టారు.
అయితే ఈ సినిమా ఎప్పుడో అనౌన్స్ చేసి ఈ ఏడాది ఏప్రిల్ రిలీజ్ కి లాక్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా ఏప్రిల్ రాదని కూడా ఒక క్లారిటీ అందరికి ఉంది. మరి అసలు రిలీజ్ ఎప్పుడు అనేది ఇపుడు వినిపిస్తుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం టాక్సిక్ సినిమా ఈ ఏడాది డిసెంబర్ కి వాయిదా వేసేసినట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. డిసెంబర్ మొదటి వారంలో ఈ చిత్రం వచ్చే ఛాన్స్ ఉందట. మరి చూడాలి దీనిపై అధికారిక అనౌన్సమెంట్ ఏమన్నా వస్తుంది అనేది.
The post యష్ టాక్సిక్ పై సాలిడ్ బజ్! first appeared on Andhrawatch.com.