టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో పీపుల్ స్టార్ సందీప్ కిషన్ హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “మజాకా”. మరి ఈ మహాశివరాత్రి కానుకగా థియేటర్స్ లోకి వస్తున్నా ఈ చిత్రానికి మేకర్స్ పైడ్ ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేశారు. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంపై ఇంట్రెస్టింగ్ టాక్ ఒకటి వినిపిస్తుంది.
దీనితో ఈ సినిమాకి కూడా సీక్వెల్ ఉండొచ్చు అట. అలాగే ఈ సీక్వెల్ టైటిల్ కూడా లాక్ చేసినట్టు తెలుస్తుంది. దీనితో మేకర్స్ పార్ట్ ని “డబుల్ మజాకా” అంటూ అనౌన్స్ చేస్తారని టాక్. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా మంచి కామెడీ ఎంటర్టైనర్ అవుతుంది అని మేకర్స్ ధీమాగా ఉన్నారు. ఇక ఆడియెన్స్ ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ ని అందిస్తారో చూడాల్సిందే.
The post యస్….సీక్వెల్ ఉంది first appeared on Andhrawatch.com.