కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “విడా ముయర్చి” వచ్చి పెద్దగా ఆకట్టుకోని సంగతి తెలిసిందే. ఆ సినిమా బాగా ఆలస్యం అవుతూ రావడం ఒక కారణం కాగా ఫ్యాన్స్ లో తమ హీరో రేంజ్ సినిమా కోసం ఆసక్తి ఎక్కువ అయ్యిపోయింది. దీనితో ఇక అంచనాలు అన్నీ అజిత్ ఫ్యాన్ డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్ సినిమా “గుడ్ బ్యాడ్ అగ్లీ” పైనే అంచనాలు నెలకొన్నాయి.
మన టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తమిళ్ లో ప్రతిష్టాత్మకంగా చేసిన ఈ చిత్రం సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ అయ్యిపోయింది. ఇక నిన్న వచ్చిన టీజర్ అయితే మళ్ళీ అజిత్ ఫ్యాన్స్ కి కావాల్సిన ఫుల్ మీల్స్ పెట్టింది అని చెప్పవచ్చు. చాలా కాలం నుంచి మిస్ అవుతున్న అజిత్ ని మళ్ళీ మైత్రి మేకర్స్ ప్రెజెంట్ చేశారు. దీనితో ఇపుడు అజిత్ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషిగా ఉన్నారు. డెఫినెట్ గా గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రం సెన్సేషనల్ ఓపెనింగ్స్, ఒకవేళ టాక్ పడితే తమిళనాట రికార్డులు తిరగరాస్తుంది అనే రేంజ్ లో ఫ్యాన్స్ కి ఇపుడు అవైటెడ్ గా మారిపోయింది.
The post ఫుల్ మీల్స్! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
