పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం అభిమానులు చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తుండగా ఇపుడు ఈ సినిమా షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉన్నప్పటికీ పవన్ ఇచ్చే డేట్స్ ఆధారంగా మళ్ళీ పట్టాలెక్కనుంది.
అయితే దీనికి ముందు సినిమా “హరిహర వీరమల్లు” చిత్రమే ఇపుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. దీనితో ఇక అది పూర్తయ్యి ఓజి సినిమా ఎప్పుడు వచ్చేది? ఇలా ఓజి రిలీజ్ పై ఒక డిజప్పాయింటింగ్ టాక్ అయితే ఇపుడు వినిపిస్తుంది. దీనితో ఈ సినిమా ఈ ఏడాదిలో కూడా రాకపోవచ్చని తెలుస్తుంది.
ముందుగా సెప్టెంబర్ రిలీజ్ కి అనుకున్నారు కానీ పవన్ నుంచి డేట్స్ అంత త్వరగా వచ్చేలా లేకపోవడం ఒకవేళ వచ్చినా కూడా కొన్ని రోజులే చేసి మళ్ళీ గ్యాప్ వస్తుండడంతో వచ్చే ఏడాదికే షిఫ్ట్ అయ్యిపోతుంది అని తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజం అయితే పవన్ ఫ్యాన్స్ పెద్ద డిజప్పాయింట్మెంట్ తప్పదని చెప్పక తప్పదు. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.
The post ఎంత మాటా! first appeared on Andhrawatch.com.