‘జాబిలమ్మ నీకు అంత కోపమా’.. ఓటీటీ లోకి ఎప్పుడంటే! | CineChitram

తమిళ హీరో ధనుష్ దర్శకుడిగా కూడా తన సత్తా చాటుకున్నాడు. ఇప్పటికే ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా ధనుష్ డైరెక్షన్‌లో తెరకెక్కిన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ NEEK తెలుగులో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా?’ అనే టైటిల్‌తో విడుదల అయ్యింది.

ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఈ సినిమా మంచి రెస్పాన్స్‌ను తెచ్చుకోవడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా మార్చి 21 నుంచి స్ట్రీమింగ్‌కు రానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

దీంతో ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయినవారు ఓటీటీలో చూసి ఫుల్‌ గా ఎంజాయ్ చేస్తారని చిత్ర యూనిట్ అనుకుంటుంది. ఇక ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

The post ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’.. ఓటీటీ లోకి ఎప్పుడంటే! first appeared on Andhrawatch.com.

About

Check Also

Rashmika Mandanna Continues Her Reign with Blockbusters & Exciting Upcoming Films | CineChitram

Rashmika Mandanna is on a roll, sweeping hearts off her feet with her charm, talent, …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading