గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండగా స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ అయితే మేకర్స్ తాజాగా ఇచ్చారు.
రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా RC16 ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను మార్చి 27న ఉదయం 9.09 గంటలకు అనౌన్స్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మేరకు ఓ ప్రీ-లుక్ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని రివీల్ చేశారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఎంత రగడ్‌గా ఉండబోతుందో ప్రీ-లుక్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.
దీంతో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలాంటి ఇంపాక్ట్ చేయబోతుందా అని మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.
The post RC16 మెగా ట్రీట్‌కు ముహుర్తం కుదిరింది! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
