ధోనితో ఐశ్వర్య! | CineChitram

ప్రస్తుతుం క్రికెట్ అభిమానులు ఐపీఎల్ 2025 ఫీవర్‌తో ఊగిపోతున్నారు. ఇప్పటికే ఈ టోర్నీలో చాలా ఆసక్తికర మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇక తమ అభిమాన క్రికెటర్ల ఆటను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, క్రికెట్ ప్లేయర్స్‌కు కేవలం కామన్ పబ్లిక్ మాత్రమే కాకుండా సెలెబ్రిటీలు సైతం అభిమానులుగా ఉంటారు. తాజాగా ఓ స్టార్ క్రికెటర్‌తో తన ఫ్యాన్ మూమెంట్ చూపెట్టింది ఓ హీరోయిన్.

ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది అందాల భామ ఐశ్వర్య రాజేష్. ఈ బ్యూటీ తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ ఎం.ఎస్.ధోనితో సెల్ఫీ దిగింది. ఈ ఫోటోలను ఆమె తన సోషల్ మీడియా అకౌంట్‌లో పెట్టింది. తన అభిమాన క్రికెటర్‌తో ఫోటో దిగడం తనకు ఎంతో సంతోషంగా ఉందంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

The post ధోనితో ఐశ్వర్య! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …