గ్లామర్ బ్యూటీ తాప్సీ చాలా బోల్డ్ గా ఉంటుంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది. తాజాగా హీరోయిన్ తాప్సీ గొప్ప మనసు చాటుకున్నారు. వేసవి కాలం కావడంతో ఎండలకు అల్లాడిపోతున్న పేదలకు ఫ్యాన్లు, కూలర్లు ఉచితంగా ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన భర్త మథియాస్ బోతో కలిసి తాప్సీ పేదల ఇళ్లకు వెళ్లి మరీ పట్టాలు అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు తాప్సీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాప్సీ గ్రేట్ అంటూ నెటిజన్లు ఆమెను పొగుడుతున్నారు. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తాప్సీ. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయింది. గ్లామర్ విషయంలో కానీ.. ఫిట్ నెస్ విషయంలో కానీ ‘తాప్సీ పన్ను’ ఏ స్టార్ హీరోయిన్ కి తక్కువ కాదు. అందుకే, ఇండస్ట్రీలో తాప్సీ పన్నుకి ఆఫర్లు రోజురోజుకు పెరుగుతున్నాయి.
The post తాప్సీది గొప్ప మనసు! first appeared on Andhrawatch.com.