టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న అవైటెడ్ భారీ చిత్రం “కింగ్డమ్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం రౌడీ బాయ్స్ ఎప్పుడు నుంచో చాలా ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాపై ప్రస్తుతం పలు రూమర్స్ వైరల్ గా మారాయి.
ఈ చిత్రాన్ని మేకర్స్ ప్లాన్ చేసిన మే 30 రిలీజ్ కి రావడం లేదని పోస్ట్ పోన్ అయినట్టుగా ఇపుడు టాక్ నడుస్తుంది. దీంతో కింగ్డమ్ రిలీజ్ విషయంలో విజయ్ ఫ్యాన్స్ కొంచెం టెన్షన్ లో కూడా ఉన్నారు. ఇక ఈ రూమర్స్ తో మాత్రం విడుదల తేదీ పై మాత్రం క్లారిటీ కోరుకుంటున్నారు. మరి మేకర్స్ కింగ్డమ్ ఎప్పుడు ఏంటి అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేస్తారా లేదా అనేది చూడాలి.
The post క్లారిటీ ఇవ్వండి సార్! first appeared on Andhrawatch.com.