పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ క్రేజీ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం గురించి తెలిసిన విషయమే. పాన్ ఇండియా కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమాని అనౌన్సమెంట్ చేయడం అనేది ఊహించని అంశంగా మారింది. అయితే ఈ చిత్రం ఇంకా షూటింగ్ కూడా మొదలు పెట్టుకోలేదు కానీ అప్పుడే మాస్ ప్రమోషన్స్ ని మొదలు పెట్టడం ఇప్పుడు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
నిన్న జరిగిన హైదరాబాద్, ఢిల్లీ మ్యాచ్ లో ఈ సినిమా అనౌన్సమెంట్ తాలూకా వీడియోలో ఎల్ఈడీస్ లో ప్లే చేయడం అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. దీనితో మేకర్స్ తమ సినిమాని ఏ రేంజ్ లో ఇపుడు నుంచే ప్రమోషన్ చేసుకుంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు నుంచే ఈ లెవెల్లో ఉంటే ఇక సినిమా మొదలై రిలీజ్ అయ్యేసరికి ఎలా ఉంటుందో.
The post అట్లీ-అల్లు మూవీకి అప్పుడే ప్రమోషన్స్! first appeared on Andhrawatch.com.