పిల్ల‌ల స‌మ‌క్షంలో పుట్టిన‌రోజు జ‌రుపుక‌న్న హీరోయిన్ యామిని భాస్క‌ర్‌

తెలుగులో కీచక, టైటానిక్ చిత్రాలతో పాటు తమిళంలో మున్నోడి వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ యామినీ భాస్కర్ పుట్టిన‌రోజు ఈరోజు(సెప్టెంబ‌ర్ 20). త‌న వేడుక‌ను బంధు మిత్రుల‌తో కాకుండా పిల్ల‌ల‌తో జ‌రుపుకోవాల‌ని భావించిన యామినీ బాస్క‌ర్  సంగారెడ్డిలోని ఓగ‌ర్ల్స్ స్కూల్‌లో పిల్ల‌ల‌తో కలిసి త‌న పుట్టిరోజు వేడుక‌ను సెల‌బ్రేట్ చేసుకుంది. అక్క‌డి స్కూల్‌లో మెరుగైన నీటిని అందించ‌డానికి వాట‌ర్ ప్యూరిఫయ్య‌ర్‌ను కూడా అందించింది. త‌న‌కు ఈ ఏడాది ఇలా పిల్ల‌ల‌తో క‌లిసి పుట్టిన‌రోజు జ‌రుపుకోవ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని, అలాగే ఓ స్టార్ హీరో మూవీలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నానని, ఆ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాన‌ని ఈ సంద‌ర్భంగా తెలియ‌జేసింది యామినీ భాస్క‌ర్.

About CineChitram

Check Also

ఏంజెల్ హీరో నాగ అన్వేష్ బర్త్ డే సెలబ్రేషన్

Leave a Reply