కేర‌క్ట‌ర్ న‌చ్చితే తెలుగు సినిమాల్లో న‌టిస్తా – త్యాగరాజన్‌

తెలుగులో `అంతిమ‌తీర్పు`, `మ‌గాడు, `స్టేట్ రౌడీ` వంటి చిత్రాల న‌టుడిగా త్యాగ‌రాజ‌న్‌కు మంచి గుర్తింపు ఉంది. హీరో ప్ర‌శాంత్ తండ్రిగా, త‌మిళ చిత్రాల ద‌ర్శ‌క‌నిర్మాత‌గా ఆయ‌న్ని అంద‌రూ గుర్తుప‌డ‌తారు. తెలుగింటి అల్లుడ‌యిన త్యాగ‌రాజ‌న్ తాజాగా `రోజ్ గార్డెన్`లో న‌టిస్తున్నారు. నితిన్ నాష్,  ఫ‌ర్నాజ్ శెట్టి జంట‌గా న‌టిస్తున్న చిత్రం `రోజ్ గార్డెన్`. జి.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 
 అనురాధ ఫిలింస్ డివిజ‌న్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. చ‌ద‌ల‌వాడ తిరుప‌తిరావు స‌మ‌ర్ప‌ణ‌లో చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్ర‌స్తుతం శంషాబాద్‌లో జ‌రుగుతోంది. ఈ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్న త్యాగ‌రాజ‌న్  శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..
“తెలుగులో `అంతిమ‌తీర్పు`, `మ‌గాడు`, `స్టేట్ రౌడీ` వంటి చిత్రాలు నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. దాదాపు మూడు ద‌శాబ్దాల త‌ర్వాత నేనిప్పుడు `రోజ్ గార్డెన్` అనే తెలుగు సినిమాలో న‌టిస్తున్నాను. ఈ చిత్రంలో ఓ టీవీ ఛానెల్ అధినేత‌గా క‌నిపిస్తాను. ఎవ‌రూ కాశ్మీర్‌లో టీవీ చానెల్ పెట్ట‌డానికి సాహ‌సించ‌రు. అలాంటి స‌మ‌యంలో నేను అక్క‌డ చానెల్‌ పెట్టాల‌నుకుంటాను. ప‌నిచేయ‌డానికి ఎవ‌రూ ముందుకు రాని త‌రుణంలో ఓ అబ్బాయి వ‌స్తాడు. అలా అత‌ను ముందుకు రావ‌డానికి కార‌ణం ఏంటి? ఆ త‌ర్వాత ఏమైంది? అనేది ఆస‌క్తిక‌రం.  ఈ చిత్ర ద‌ర్శ‌కుడు ర‌వికుమార్ నాకు చాలా స‌న్నిహితుడు. అత‌నికి ప‌లు శాఖ‌ల‌పై మంచి అవ‌గాహ‌న ఉంది. మా `తొలిముద్దు` సినిమాకు ర‌వికుమార్ కూడా ప‌నిచేశారు. ఆ చిత్రానికి కెమెరామేన్‌గా ప‌నిచేసిన శంక‌ర్ ఇప్పుడు `రోజ్‌గార్డెన్` కు కెమెరామేన్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ర‌వికుమార్ ఈ మధ్య నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి `రోజ్ గార్డెన్` కాన్సెప్ట్ చెప్పారు. నేను న‌టిస్తే బావుంటుంద‌ని కోరారు. పాత్ర న‌చ్చింది. దాంతో పాటు ర‌వి మాట కాద‌న‌లేక ఒప్పుకున్నాను. కాశ్మీర్‌లో చిత్రీక‌రించిన స‌న్నివేశాలు, పాట‌లు త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చుతాయి“ అని అన్నారు. కేర‌క్ట‌ర్ న‌చ్చితే భ‌విష్య‌త్తులో కూడా తెలుగు సినిమాల్లో న‌టించాల‌నే ఆస‌క్తి ఉంద‌ని తెలిపారు.
త‌న త‌న‌యుడు, హీరో ప్ర‌శాంత్ గురించి మాట్లాడుతూ “ప్ర‌శాంత్ న‌టించిన ద్విభాషా చిత్రం `బొబ్బిలి` త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. ఇప్పుడు ప్ర‌శాంత్ హిందీలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు ద‌ర్శ‌క‌నిర్మాత‌ను నేనే. ఆ త‌ర్వాత ప్ర‌శాంత్ ఓ తెలుగు సినిమాలో న‌టిస్తాడు. తెలుగులో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు దానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. ప్ర‌శాంత్ నేరుగా తెలుగులో చేసే ఆ సినిమాకు సంబంధించిన క‌థ‌ల‌ను ఇప్పుడు వింటున్నాం“అని చెప్పారు.
`క్వీన్` సినిమా గురించి మాట్లాడుతూ “కంగ‌నా ర‌నౌత్ న‌టించిన క్వీన్ చిత్రం సౌత్ ఇండియా రైట్స్ నేను తీసుకున్న విష‌యం తెలిసిందే. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళంలో ఈ సినిమాను రూపొందించ‌నున్నాం. నాలుగు భాష‌ల్లోనూ రెండో నాయిక‌గా ఎమీ జాక్స‌న్ న‌టిస్తుంది. త‌మిళంలో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. మ‌ల‌యాళంలో అమ‌లాపాల్ నాయిక‌. త‌మిళ‌, మ‌ల‌యాళ చిత్రాల‌కు రేవ‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. క‌న్న‌డ‌లో ప‌రుల్ యాద‌వ్ హీరోయిన్‌గా ప్ర‌కాశ్‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా ఉంటుంది. తెలుగులో అనీష్ కురువిళ్ల ద‌ర్శ‌క‌త్వం చేస్తారు. తెలుగుకు సంబంధించి ఇంకా హీరోయిన్ ఫైన‌లైజ్ కాలేదు. ఈ నాలుగు భాష‌ల్లోనూ నేనే నిర్మిస్తాను“ అని తెలిపారు.

Stills

About CineChitram

Check Also

సమసమాజ నిర్మాణం కోసం నడుం బిగించిన బొమ్మకు మురళి

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading