యంగ్ హీరో రాజ్‌తరుణ్ హీరోగా ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యానర్‌పై `దొంగాట` ఫేమ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా రూపొందిన చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`. ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ను మార్చి 3న విడుదలై సూపర్‌హిట్ అయ్యింది. ఈ సందర్భంగా దర్శకుడు వంశీకృష్ణతో ఇంటర్వ్యూ…
కథ ఐడియా అక్కడ నుండి పుట్టిందే…
– బేసిక్‌గా కథ శ్రీకాంత్ విస్సాది. ఓ రోజు శ్రీకాంత్‌గారు నడిచి వెళ్తుంటే కుక్కును తీసుకెళ్తున్న ఓకాయన నిన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తే బావుండే..అని అనడం విన్నాడట. ఆ సిచ్చువేషన్ నుండి కిట్టుగాడు జాగ్రత్త కథ పుట్టింది.
కొత్త ఎక్స్‌పీరియెన్స్..
– దొంగాట సినిమా కథ నాదే. అయితే కిట్టు ఉన్నాడు జాగ్రత్త కథ శ్రీకాంత్‌ది. కథ మాత్రం తను ఇచ్చినా స్క్రీన్‌ప్లే అంతా నేనే స్టోరీ బోర్డ్‌తో ప్రిపేర్ చేసుకున్నాను. సినిమాలో పదహారు క్యారెక్టర్స్ ప్రతి దానికి ఓ ఇంపార్టెన్స్ ఉంది.
పృథ్వీ క్యారెక్టర్ గురించి..
– పృథ్వీగారిని అందరూ థర్టీ ఇయర్స్ అంటుంటారు. ఆయన చేసిన క్యారెక్టర్స్‌లో చాలా వరకు స్పూఫ్‌లు ఎక్కువగా చేశారు. అయితే ఇంతకు ముందు నా దర్శకత్వంలో ఆయన చేసిన దొంగాట సినిమాలో క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ కిట్టుఉన్నాడు జాగ్రత్తలో ఎలాంటి స్పూఫ్ లేకుండా కొత్తగా ట్రై చేశాం. అందుకనే పృథ్వీ క్యారెక్టర్‌కు చాలా మంచి పేరు వచ్చింది.
చాలా మంచి అప్రిసియేషన్…
– ఇండస్ట్రీ నుండి చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఈ సినిమాలో కథ, స్క్రీన్‌ప్లేతో పాటు కామెడి కూడా ఎన్‌హాన్స్ కావడం సినిమాకు ప్లస్ అయ్యింది. ఎక్కువగా స్క్రీన్‌ప్లే బుక్స్ చదువుతుంటాను. ఒక సీన్‌ను అందంగా డిజైన్ చేసి చెప్పడమే స్క్రీన్‌ప్లే. అది చాలా కష్టతరమైన పని.
తప్పేం జరగలేదు…
– దొంగాట సినిమాలో తప్పేం జరగలేదు. సినిమా విడుదలైన మంచి లాభాలను తెచ్చి పెట్టిన సినిమా. కానీ రిలీజైన సమయం సరిగా లేదని అనుకుంటున్నాను.
తన బాడీ లాంగ్వేజ్‌ను మార్చాను..
– రాజ్‌తరుణ్ ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో కంటే ఈ సినిమాల్లో ఎక్స్‌ప్రెషన్స్ చక్కగా చేశాడని, తన బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉందని అంటున్నారు. అందుకు కారణం, తన గత చిత్రాలను చూసిన నేను, డైలాగ్‌కు మధ్య స్పేస్ ఇస్తూ క్యారెక్టర్‌ను డిజైన్ చేయించాను. అందుకే తన క్యారెక్టర్‌కు మంచి అప్లాజ్ వచ్చింది.
దాన్ని అందరూ నిర్లక్ష్యం చేస్తారు..
– ఒక డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. దర్శకుడు కావాలనుకున్న వాడికి అన్నీ విషయాలపై అవగాహన ఉండాలనే ఉద్దేశంతో నేను దర్శకుడు కాక ముందు శ్రీకర్‌ప్రసాద్‌గారి వద్ద ఎడిటింగ్ టీంలో వర్క్ చేశాను. తర్వాత ప్రొడక్షన్ సంబంధించిన విషయాలు నేర్చుకున్నాను. సాధారణంగా దర్శకుడికి, తను చేయబోయే సినిమా ప్రొడక్షన్ గురించి అవగాహన ఉండాలి. సాధారణంగా అందరూ ప్రొడక్షన్ విషయాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. తర్వాతే డైరెక్షన్ నేర్చుకున్నాను. 11 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను.
తదుపరి సినిమాలు..
– ఉన్నాయండీ. నెక్స్ట్ స్పై థ్రిల్లర్ చేయాలనుకుంటున్నాను. ఎవరితో అన్నది ఇంకా ఫైనలైజ్ కాలేదు. కాకపోతే నాని, శర్వానంద్, బన్నీతో సినిమా చేయాలని ఉంది.
You must be logged in to post a comment.