ప్రముఖ నిర్మాత, `సంతోషం` అధినేత సురేష్ కోండేటిని పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం కళాపరిషత్ ఘనంగా సత్కరించింది. కార్యక్రమానికి అతిధిగా విచ్చేసిన రాష్ర్ట కార్మిక శాఖ మాత్యులు పితాని సత్యనారాయణ సురేష్ కోండేటిని సాలువా తో సన్మానించారు.
అనంతరం మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ, – `నిబద్దత, క్రమశిక్షణతో కృషిచేస్తే ఎంతటి కార్యాన్ని అయినా సాధించవ్వు. అనుకున్న రంగంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. సురేష్ గారు ఎంతో కష్టపడి ఈస్థాయికి వచ్చారు. గోదావరి జిల్లా నుంచి సినీ రంగంలోకి వెళ్లిన వారంతా జిల్లా కీర్తిని దేశమంతా చాటి చెబుతన్నారు. అలాంటి వ్యక్తుల్లో సురేష్ కొండేటి ఒకరు. ఆయన సినీ రంగంలో మరింత రాణించాలని కోరుకుంటున్నా` అని అన్నారు.
వీరవాసరం కళాపరిషత్ అధ్యక్షుడు గుండా రామకృష్ణ మాట్లాడుతూ,- ` సురేష్ కు చిన్న తనం నుంచి కళల పట్ల మక్కువ ఎక్కువ. తనని ఆఫ్యాషన్ నే ఇంతటి వాడిని చేసింది. జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన నేడు ఉన్నత స్థానంలో కొనసాగడం సంతోషంగా ఉంది. సురేష్ ను సన్మానించడం ద్వారా కళాపరిషత్ పేరు మరింత పెరిగింది` అని అన్నారు.
సన్మానితుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ, -` నేను సంతోషం అవార్డ్స్ తో ఎంతో మందిని సన్మానిస్తుంటాను. అలాంటిది నాకు నేడు పుట్టిన గడ్డపై మంత్రి వర్యులు పితాని సత్యానారాణగారు చేతుల మీదుగా., అదీ వీరవాసరం కళాపరిషత్ ఆధ్వర్యంలో సన్మానం జరగడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను` అని అన్నారు.
ఇదే వేదికపై సీబీఐ అధికారి బి.పెద్దిరాజును కూడా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, స్థానికి సర్పంచ్ విక్టోరియా రాణి, రంగసాయి, వలవల రామకృష్ణ, కరంశెట్టి మూర్తి తదితరులు పాల్గొన్నారు.
You must be logged in to post a comment.