కళలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన పాలకొల్లును అంతర్జాతయ లఘుచిత్రోత్సవం నిర్వహించడం ద్వారా మరోసారి ఆ కళను తెచ్చారని ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. పాలకొల్లు రామచంద్ర గార్డెన్స్‌లో శుక్రవారం నిర్వహించిన క్షరపురి అంతర్జాతీయ లఘుచలనచిత్రోత్సవాలను ఆయన ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు దీనికి అధ్యక్షత వహించారు.
మంత్రి కామినేని మాట్లాడుతూ -“లఘు చిత్రాల పోటీ ఏంటి? దానికి పాలకొల్లు వేదిక ఏంటి? అని తొలుత భావించినా ఊహకు అందని విధంగా పోటీలను నిర్వహించడం ఆనందాన్నిచ్చింది“ అన్నారు. అనంతరం నిర్వాహక కమిటీని కామినేని అభినందించారు.
దేవాదాయ శాఖ మంత్రి పైడి కొండల మాణిక్యరావు మాట్లాడుతూ -“సమాజాన్ని చైతన్యపరిచే లగుచిత్రాలను తెరకెక్కించే నవతరాన్ని ప్రోత్సహించడం పాలకొల్లుకే చెల్లింది. కాలం ఖరీదైన ఈ రోజుల్లో ప్రయాణాల్లో సైతం వినోదాన్ని, సందేశా్ని వీక్షించేలా లఘుచిత్రాలు రాజ్యమేలుతున్నాయన్నారు. వాటికి పాలకొల్లు వేదికగా పోటీలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు“ అన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మున్సిపల్ ప్రతిపక్ష నేత ఎడ్ల తాతాజీ, బీజేపీ నాయకులు బొంగా సారథి, `సంతోషం` అధినేత, నిర్మాత సురేష్‌కొండేటి, ఉన్నమట్ల కబర్షి, క్షీరపురి అంతర్జాతయ ఫిలింఫెస్టివల్ కమిటీ ముత్యాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కేశిరాజ్ రాంప్రసాద్, సభ్యులు రావూరి వెంకట అప్పారావు, ఎం.ఎస్.వాసు, ఏతం రమేష్, గొర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.