ప్రియతమ ముఖ్యమంత్రి కేసియార్ డ్రీమ్ మిషన్స్ లో “స్వచ్ఛ్ తెలంగాణ” ఒకటి. ఆయన ఆశయ సాధనలో భాగంగా.. హైద్రాబాద్ నగరపాలకమండలి ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా.. సినిమా స్టార్స్ తో కలిసి.. కార్పొరేటర్స్.. క్రికెట్ ఆడుతుండడం అత్యంత అభినందనీయమని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు.
జి. హెచ్.ఎం.సితో కలిసి..స్టార్స్ అండ్ క్రికెట్ ఎంటర్ టైన్ మెంట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం.. అందుకు పలు సంస్థలు సహకరిస్తుండడం ఆనందదాయకమని ఆయన అన్నారు.
స్టార్స్ అండ్ క్రికెట్ ఎంటర్ టైన్ మెంట్ ఫౌండర్ చైర్మన్ అభినవ్ సర్దార్, కో-ఫౌండర్ శ్రీధర్ రావులను ఈ సందర్బంగా మేయర్ అభినందించారు.
హైదరాబాద్ నగర పాలకమండలి పదవీ బాధ్యతలు స్వీకరించి.. సంవత్సరం పూర్తి కావస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని..
జి.హెచ్.ఎం.సితో కలిసి స్టార్స్ అండ్ క్రికెట్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్వహిస్తున్న “స్వచ్ఛ్ హైదరాబాద్ ట్రోఫీ” వివరాలు వెల్లడించేందుకు “కేఫ్ హట్-కె”లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో.. స్టాండింగ్ కమిటీ మెంబర్ మరియు కార్పొరేటర్ వి. శ్రీనివాస్ రెడ్డి (వీఎస్సార్), కార్పొరేటర్స్ గద్వాల విజయలక్ష్మి, మనోహర్, స్వప్న, సునరిట, మమతలతోపాటు.. హీరోయిన్ అక్ష, హీరో సమ్రాట్, స్నిగ్ధ, గురురాజ్, స్టార్స్ అండ్ క్రికెట్ ఎంటర్ టైన్ మెంట్స్ ఫౌండర్ చైర్మన్ అభినవ్ సర్దార్, కో- ఫౌండర్ శ్రీధర్ రావ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ లోహిత్, కళామందిర్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా.. “హైదరాబాద్ తల్వార్స్” మరియు “హైదరాబాద్ రూలర్స్” లోగోలను మేయర్ ఆవిష్కరించారు.
ప్రజల్లో పరిశుభ్రత పట్ల అవగహనతోపాటు.. వారిలో క్రీడాస్ఫూర్తిని నింపేందుకు ఫిబ్రవరి 5 న ఎల్.బి.స్టేడియంలో ఏర్పాటుచేస్తున్న ఈ క్రీడా సంబరాన్ని విజయవంతం చేయాలని మిగతా వక్తలు పేర్కొన్నారు.
జి. హెచ్.ఎం.సితో కలిసి.. “కార్పొరేటర్స్ Vs సినీ స్టార్స్ క్రికెట్” ను కండక్ట్ చేసే అవకాశం రావడం తమకు గర్వకారణమని అభినవ్ సర్దార్ అన్నారు.
ఈ కార్యక్రమానికి.. ప్రముఖ నటుడు మరియు స్టార్స్ ఆండ్ క్రికెట్ ఎంటర్ టైన్ మెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ లోహిత్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు!!