దర్శకులు ఎ కోదండరామిరెడ్డి , బి గోపాల్ లకు డా. గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళా పరిషత్ జీవన సాఫల్య పురస్కారాలు

హైదరాబాద్:

ప్రఖ్యాత చలన చిత్ర దర్శకులు ఎ కోదండరామిరెడ్డి , బి గోపాల్ లకు డా. గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళా పరిషత్ జీవన సాఫల్య పురస్కారాలతో సత్కరించనున్నట్లు సంస్థ అధ్యక్షులు శ్రీ మేడికొండ శ్రీనివాస చౌదరి తెలిపారు .

11 మార్చి 2017 సా. 6 గం. లకు పాలకొల్లు లోని శ్రీ యియ్యపు వీరభద్రయ్య కళా ప్రాంగణం , మఠం వీధి, పాలకొల్లు లో జరిగే డా. గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళా పరిషత్
​ జాతీయ స్థాయి నాటకోత్సవాలు ప్రారంభోత్సవ సభలో వీరిని కేంద్రమంత్రి శ్రీ సుజనా చౌదరి, శాసన మండలి చైర్మన్ శ్రీ చక్రపాణి , వైద్య శాఖా మంత్రి శ్రీ కామినేని శ్రీనివాస్ , పూర్వ కేంద్ర మంత్రి శ్రీమతి పురందేశ్వరి, శ్రీ డొక్కా మాణిక్య వరప్రసాద్ లు సత్కరిస్తారని తెలిపారు . ​ఈ సభలో పాలకొల్లు కు చెందిన మాటల రచయిత శ్రీ చింతపల్లి రమణ కు “గజల్ ఆత్మీయ ప్రతిభా పురస్కారాన్ని” అందించనున్నారు .

మార్చి 11 నుండి 13 వరకు ఈ జాతీయ నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు అందులో
​9​ నాటికలను ప్రదర్శించనున్నట్లు సంస్థ ​వ్యవస్థాపకులు ​ శ్రీ మానాపురం సత్యన్నారాయణ​, కార్యదర్శి శ్రీ కృష్ణ వర్మ ​తెలిపారు

About CineChitram

Check Also

శతమానంభవతి, పెళ్లిచూపులు చిత్రాలు తెలుగు సినిమా ఖ్యాతిని నిలబెట్టాయి: కేవీ రమణచారి

పెళ్లిచూపులు చిత్రం తెలంగాణ యాసకు, భాషకు జాతీయ స్థాయిలో గౌరవాన్ని తెచ్చిపెట్టింది. మనదైన మాండళికాన్ని సహజంగా ఆవిష్కరించిన చిత్రమిది అని …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading