`శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘శతమానంభవతి`. మిక్కి జె.మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ ఫైనాన్సియర్ సత్య రంగయ్య, ఆయన కుమారుడు ప్రసాద్, మనవడు రంగ యశ్వంత్ బిగ్ సీడీసీడీని విడుదల చేశారు. ఆడియో సీడీలను సత్య రంగయ్య విడుదల చేసి తొలి సీడీని మిక్కి జె.మేయర్‌కు అందించారు.
మూడు తరాలకు సంబంధించిన ప్రేమానురాగాలను తెలియజేసే `శతమానం భవతి`చిత్రంలో ప్రకాష్‌రాజ్, జయసుధ మొదటి జనరేషన్ జంటగా నటిస్తున్నారు. “విదేశాలకు వెళ్లి మనం ఎమోషన్స్‌ను మరచిపోతున్నాం, ఈ సినిమా చూస్తే ఆ అనుభూతులు మనకు మళ్ళీ గుర్తుకు వస్తాయి” అంటున్నారు నిర్మాత దిల్ రాజు. దిల్ రాజు,ఆయన కుటుంబ సభ్యుల మధ్య, ప్రేక్షకులు యూనిట్ సభ్యుల మధ్య దిల్ రాజు పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.
“నిర్మాతగా నేను సక్సెస్ అయ్యానంటే నా కుటుంబ సభ్యులతో పాటు చాలా మంది అండగా నిలబడ్డారు”, అని దిల్ రాజు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. “మనలో, మన ఫ్యామిలీలో ఎవరైనా ఒకరు పల్లెటూరు నుండి వచ్చే ఉంటారు. మనం ఈ బిజీ లైఫ్‌లో పడి అనుబంధాలను మరచిపోతున్నాం. ఆ ఎమోషన్స్‌ను మనకు గుర్తుకు తెచ్చే సినిమా ఇది. ఈ సినిమా మూడు జనరేషన్స్‌కు సంబంధించినదని సతీష్ చెప్పగానే ఎగ్జయిట్ అయ్యాను. ముందు ఈ కథను సాయి ధరమ్ తేజ్, రాజ్ తరుణ్ హీరోలుగా చాలా చాలా అనుకున్నాం. సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. అందుకని ఓ సారి నేను యు.ఎస్ వెళ్లినప్పుడు శర్వానంద్ యు.ఎస్‌లో ఉన్నాడని తెలుసుకుని తనైతే ఈ కథనకు సరిపోతాడనిపించి ఫోన్‌లో పదిహేను నిమిషాల కథను వినిపించాను. మా మద్య అనుబంధంతో శర్వానంద్ పూర్తి కథను వినడానికి ఒప్పుకున్నాడు. అయితే కథ విన్న తర్వాత సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ప్రతి సీన్ బ్యూటీఫుల్‌గా ఉంటుంది. మిక్కి మంచి మ్యూజిక్‌ను అందించారు. సంక్రాంతికి ఓ మంచి సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నా” అని అన్నారు.
“రామానాయుడు నుండి ఇప్పటి వరకు ఎంతో మంది నిర్మాతలతో వర్క్ చేశాను. ఈ జనరేషన్‌లో సినిమా అంటే చాలా ప్యాషన్ ఉన్న వ్యక్తుల్లో దిల్ రాజుగారు ఒకరు. ఆయన బ్యానర్‌లో నేను చేసిన సినిమాలన్నీ నాకు మంచి పేరు తెచ్చాయి. వాటి సరసన శతమానం భవతి సినిమా కూడా నిలిచిపోతుంది. మిక్కి బ్యూటీఫుల్ మ్యూజిక్ అందించారు. సంక్రాంతి సందర్భంగా రానున్న ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చతుంది” అని సహజనటి జయసుధ తెలిపారు .
“తాత అయిన తర్వాత దిల్ రాజు జరుపుకుంటున్న తొలి పుట్టినరోజు ఇది. ఒక కుటుంబ విలువలు ఉన్న సినిమాలను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చిన నిర్మాత దిల్ రాజుగారికి శతమానం భవతి ఓ స్పెషల్ మూవీ. మిక్కి మ్యూజిక్ అందించిన ఈ సినిమా పాటలు ఇకపై అన్నీ పెళ్ళి వేడుకల్లో వినపడతాయి. శర్వా డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. తనకు శతమానం భవతి మరో పెద్ద సక్సెస్ కావాలలి” అని వంశీ పైడిపల్లి తెలియజేశారు.
సినిమ పెద్ద హిట్ కావాలని శేఖర్ కమ్ముల యూనిట్‌ను అభినందించారు.
“శతమానం భవతి సినిమాను 49రోజుల్లోనే పూర్తి చేశాం. ఈ కథను నమ్మి, నాపై నమ్మకంతో నాతో పాటు ఏడాదిన్నర ట్రావెల్ చేసి ఈ సినిమాను నిర్మించిన దిల్ రాజుగారికే ఈ క్రెడిట్ దక్కుతుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ ఈ పదాలను మనం చిన్నప్పుడు నేర్చుకునే ఉంటాం. అయితే వీటి అర్థాలను పూర్తిగా తెలుసుకునేటప్పటికీ మనం తల్లిదండ్రులకు దూరంగా ఉంటాం. ఇలాంటి ఓ ఆలోచన నుండి పుట్టిన కథే మా `శతమానంభవతి` “అని దర్శకుడు సతీష్ వేగేశ్న సహకారం అందించిన యూనిట్‌కు ధన్యవాదాలను తెలియజేశారు.
“దిల్ రాజుగారి బ్యానర్‌లో `శతమానం భవతి` సినిమా చేయడం ఆనందంగా ఉంది. సెన్సిటివ్ మూవీ. అమెరికాలోని ఉండే తెలుగువారితో పాటు తాత తండ్రులు, మనవళ్లందరూ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. మంచి సాహిత్యం కుదిరింది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్ ” అని మ్యూజిక్ డైరెక్టర్ మిక్కి జె.మేయర్ చెప్పారు.
`శతమానం భవతి `కథ బ్యూటీఫుల్‌గా ఉంటుంది. నేను కథ విన్నాను.విలక్షణమైన సినిమాలను చేస్తున్న శర్వానంద్ ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. తనకు ఈ సినిమాతో మరో సక్సెస్ వస్తుంది. అనుపమ పరమేశ్వరన్ బెస్ట్ నటి. మిక్కి జె.మేయర్ చాలా మంచి సంగీతానందించారు. సినిమాలో చిన్న చిన్న ఎమోషన్స్‌కు కూడా మంచి విలువలు ఉంటాయి. సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది ” అని హీరో రాజ్‌తరుణ్ అన్నారు.
“దిల్‌రాజుగారి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఆడియో వేడుక జరగడం ఆనందంగా ఉంది. దిల్ రాజుగారు ఎంత పెద్ద స్టార్స్‌తో అయినా సినిమాలు తీయగలరు. అంతే కాదు.. చిన్న హీరోలతో కూడా సినిమాలు చేయడమే కాదు. చిన్న సినిమాలకు మంచి హైప్ తీసుకొచ్చే నిర్మాత దిల్ రాజుగారు. శర్వానంద్ మంచి కథలను ఎంచుకుని సినిమాలు చేస్తున్నారు. సంక్రాంతి సమయంలో వచ్చే ఈ సినిమా పెద్ద హిట్ కొడుతుందని ఆశిస్తున్నా ” అని హీరో నిఖిల్ తెలిపారు.
“శతమానం భవతి అనే చిత్రంలో నిత్య అనే క్యారెక్టర్‌ను ఇష్టపడి చయడం నా లైఫ్‌లో మరచిపోలేను. అందుకు కారణమైన డైరెక్టర్ సతీష్‌గారికి, దిల్‌రాజుగారికి, సమీర్‌రెడ్డిగారికి, శర్వానంద్, మిక్కికి థాంక్స్. శర్వానంద్ మంచి కోస్టార్. ప్రకాష్ రాజ్, జయసుధ వంటి ఎక్స్‌పీరియెన్స్ ఉన్న నటులతో చేయడం మరచిపోలేని అనుభూతి ని ఇచ్చింది” అని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చెప్పారు.
“కథ వినగానే జెన్యూన్‌గా ఫీలై మనసుకు నచ్చి మంచి సినిమా, ఈ సినిమాను మిస్ చేయకూడదనిపించి చేసిన సినిమా `శతమానం భవతి`. ప్రతి ఫ్యామిలీ చూసే సినిమా. చూసిన తర్వాత అందరూ హ్యాపీగా ఇంటికి వెళతారు. మిక్కి ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు విన్నవారికి వారు ఊరు గుర్తుకు వస్తుందని నాతో అన్నారు. జయసుధగారు, ప్రకాష్‌రాజ్‌గారు, నరేష్‌గారు, అనుపమ సహా అందరితో నటించడం మరచిపోలేని అనుభూతి. సినిమాలో ప్రతి సీన్ అద్భుతంగా చూపడంలో సమీర్‌గారు సూపర్బ్ వర్క్ చేశారు. రాజుగారు ఊరకనే దిల్ రాజు కాలేదు. ఒక సీన్ కూడా మిస్ కాకూడదని ఆయన దగ్గరుండి రాయించుకున్నారు. ఈ సినిమాతో రాజన్నపై రెస్పెక్ట్ ఇంకా పెరిగింది. ఇలాంటి బ్యానర్‌లో చేయాలని అందరికీ ఉంటుంది. ఇంత మంచి కథను దిల్ రాజు గారు ఆయన బ్యానర్‌లో చేసే అవకాశం ఇచ్చినందుకు దిల్ రాజు గారికి థాంక్స్” అని హీరో శర్వానంద్ తెలిపారు
ఈ కార్యక్రమంలో ఇంద్రజ, అనుపమ పరమేశ్వరన్, రాజ్ తరుణ్, నిఖిల్, కాస్ట్యూమ్ కృష్ణ సహా పలువరు అతిథులు ఆడియో వేడుకలో పాల్గొన్నారు. సినిమాలో వర్క్ చేసిన సాంకేతిక నిపుణులను నిర్మాత దిల్‌రాజు సత్కరించారు.
శర్వానంద్ , అనుపమ పరమేశ్వరన్ , ప్రకాష్ రాజ్ , జయసుధ , ఇంద్రజ , శివాజీ రాజా , ప్రవీణ్ , సిజ్జు , శ్రీ రాం , మధురిమ , నీల్యా , ప్రమోదిని, మహేష్ , భద్రం , హిమజ , ప్రభు తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం – సమీర్ రెడ్డి, సంగీతం – మిక్కీ జె. మేయర్, సాహిత్యం – శ్రీ మణి, రామజోగయ్య శాస్త్రి, కూర్పు – మధు, కళా దర్శకుడు – రమణ వంక, కథ – కథనం –మాటలు-దర్శకత్వం – వేగేశ్న సతీ