ఇటీవలే ‘జక్కన్న’ తొ కమర్షియల్ సక్సెస్ ని తన సొంతం చేసుకొని సూపర్ లైన్ అప్ తో దూసుకు పోతున్న సునీల్ హీరోగా, ఓనమాలు వంటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకొని… మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి కమర్షియల్ సక్సెస్ మూవీతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి ఉంగరాల రాంబాబు అనే క్యాచీ టైటిల్ ను ఖరారు చేశారు. రథ సప్తమి సందర్బంగా ఈ చిత్ర ప్రచార రథాన్ని సంస్థ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ చిత్ర మొదటి ప్రచార చిత్రాన్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
పలు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై ఉంగరాల రాంబాబు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి నిర్మిస్తున్న ఉంగరాల రాంబాబు చిత్రం సునీల్ అన్ని చిత్రాల కంటే హై స్టాండర్డ్ లో వుంటుంది. సునిల్ చిత్రాల నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో పాటు.. క్రాంతి మాధవ్ తరహా మేకింగ్ తో పాటు… నిర్మాత పరుచూరి కిరీటి చిత్రాల్లో కనిపించే కమర్షియల్ హంగులు ఈ చిత్రంలో కనిపించనున్నాయి. స్టార్ కెమెరామెన్ సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫి అందిస్తుండడం విశేషం. మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ ” మా దర్శకులు క్రాంతి మాధవ్ తెరకెక్కించిన రెండు చిత్రాలు హృదయాలకి హత్తుకునేలా వుంటాయి. ఆయన మార్క్ వుంటూనే, సునిల్ తరహా కామెడి చేస్తూ ఓ చక్కని కమర్షియిల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను అందిచబోతున్నారు. సునీల్ పెర్ ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్ గా తన కామెడి తో జక్కన్న చిత్రాన్ని కమర్షియల్ గా విజయాన్ని తన ఖాతాలో జమచేసుకున్నాడు. ఈ చిత్రంలో తన క్యారెక్టరైజేషన్ ను విభిన్నంగా మలిచారు. కథ, కథనాలకు తగ్గట్టుగా ఉంగరాల రాంబాబు అనే టైటిల్ ను నిర్ణయించాం. రథ సప్తమి సందర్భంగా మా చిత్ర ప్రచారాన్ని ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాం. ఇందులోని ప్రతీ పాత్రకు ప్రాధన్యముండేలా తీర్చి దిద్దారు. అద్భుతమైన సినిమాటోగ్రాఫర్స్ సర్వేశ్ మురారి, శ్యామ్ కె నాయుడు కెమెరామెన్ గా పనిచేస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. అన్ని వర్గాల్ని మెప్పించే ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ మూవీ కాబోతుంది. మా బ్యానర్ నుంచి సూపర్ హిట్ చిత్రం చేయబోతున్నామని ధీమాగా చెప్పగలుగుతున్నాం. 90 శాతం చిత్రీకరణ పూర్తైంది. త్వరలోనే గ్రాండ్ గా ఆడియో లాంచ్ నిర్వహించబోతున్నాం. వేసవి కానుకగా ఉంగరాల రాంబాబును ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. ”అని అన్నారు.
నటీ నటులు – సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, ఆశిష్ విద్యార్థి, ఆలీ, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధు నందన్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్, దువ్వాసి మోహన్, సత్తెన్న, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, విజయ్ కుమార్, నల్ల వేణు, అనంత్, మిర్చి హేమంత్, ఐమాక్స్ వెంకట్, రమణా రెడ్డి, శ్రీ హర్ష, శివన్ నారాయణ, మాస్టర్ హన్సిక్, కె.ఎల్.ప్రసాద్, జెమిని ప్రసాద్, మణిచందన, హరి తేజ, మౌళిక, మిధున
సాంకేతిక వర్గం
మ్యూజిక్ – జిబ్రాన్
లిరిక్స్ – రామ జోగయ్య శాస్త్రి, రెహమాన్
సినిమాటోగ్రఫి – సర్వేష్ మురారి, శ్యామ్ కె నాయుడు
ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వర రావ్
ఫైట్ మాస్టర్ – వెంకట్
డైలాగ్స్ – చంద్ర మోహన్ చింతాడ
ఆర్ట్ – ఎ.ఎస్.ప్రకాష్
కొరియో గ్రఫి – భాను మాస్టర్
పబ్లిసిటీ – ధని
పిఆర్ఓ – ఏలూరు శ్రీను, ఎస్ కె ఎన్
బ్యానర్ – యునైటెడ్ కిరీటి మూవీస్ లిమిడెట్
ప్రొడ్యూసర్ – పరుచూరి కిరీటి
డైరెక్టర్ – కె. క్రాంతి మాధవ్