ప్రతి ఏడాది ఎంతో ఘనంగా నిర్వహింపబడే టి.ఎస్.ఆర్-టీవీ9 అవార్డ్స్ 2015-16 సంవత్సరానికిగానూ ఇవ్వనున్నారు. తెలుగు, తమిళం, హిందీ, బెంగాళీ, మలయాళం, కన్నడ, పంజాబీ భాషల సినిమాలకు ఈ అవార్డులనిస్తారు. శుక్రవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో 2015-16కు సంబంధించిన నామినేషన్స్‌ను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పివిపి, జయసుధ, మీనా, పింకీ రెడ్డి, జీవితరాజశేఖర్,దర్శకుడుబి.గోపా
టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ – “కళాకారులంటే నాకెంతో అభిమానం. వాళ్లను సత్కరించడం ద్వారా నాకెంతో ఆత్మసంతృప్తి లభిస్తుంది. ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా టి.ఎస్.ఆర్-టీవీ9 అవార్డులను నిర్వహిస్తున్నాం. అందుకు ప్రతి కేటగిరీలో సినిమాను ఎంపిక చేశాం. మార్చి 8 నుండి నెలరోజుల పాటు జరిగే ఎస్.ఎం.ఎస్ పోల్ ద్వారా ప్రేక్షకులు తమకు నచ్చిన వారికి ఈ అవార్డును వచ్చేలా చేయవచ్చు. విశాఖలో 50వేల మంది ప్రేక్షకుల మధ్య ఈ అవార్డు వేడుకను నిర్వహిస్తాం“ అన్నారు.
ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ – “సుబ్బరామిరెడ్డిగారు నిర్వహించే అవార్డులకు ప్రత్యేకత ఉంటుంది.ఎన్నో వేడుకలు చూశాం. కానీ పబ్లిక్‌లో ఇంత బారీ వేడుకను నిర్వహిస్తుండటం ఇదే మొదటిసారి అవుతుంది. ఏప్రిల్ 8న ఈ భారీ వేడుక జరగనుంది“ అన్నారు.
బి.గోపాల్ మాట్లాడుతూ – “ఈ టి.ఎస్.ఆర్-టీవీ9 అవార్డ్స్‌ను ఎంతో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ప్రజల సపోర్ట్ ఉంటుందని భావిస్తున్నాం“ అన్నారు.
పింకీ రెడ్డి మాట్లాడుతూ – “నేను చిన్నప్పటి నుండి సినీ తారలను చూస్తూ పెరిగాను. నాన్నగారికి సినీతారలతో ఎంతో మంచి అనుబంధం ఉంది. వారిని సత్కరిస్తూ ఉంటారు. అలాగే టి.ఎస్.ఆర్-టీవీ9 అవార్డ్స్‌ను నిర్వహిస్తున్నారు. వైజాగ్‌లో ఏప్రిల్ 8న చేయనున్న టి.ఎస్.ఆర్-టీవీ9 అవార్డ్స్‌కు అందరినీ ఆహ్వానిస్తున్నాం“ అన్నారు.
జీవిత మాట్లాడుతూ – “ టి.ఎస్.ఆర్-టీవీ9 అవార్డ్స్ కమిటీలో జ్యూరీ మెంబర్‌గా కొనసాగుతున్నాను. వైజాగ్‌లో వేల మంది జనాల మధ్య ఈ వేడుక ఘనంగా జరుగుతుంది. అందరూ సహకరిస్తారని భావిస్తున్నాను“ అన్నారు.
మీనా మాట్లాడుతూ – “ టి.ఎస్.ఆర్-టీవీ9 అవార్డ్స్‌లో నేను కూడా జ్యూరీ మెంబర్‌గా ఉన్నాను. సుబ్బరామిరెడ్డిగారు ఏం చేసినా బ్రహ్మాండంగా చేస్తారు. కచ్చితంగా ఏప్రిల్‌లో జరగనున్న ఈ వేడుక భారీగా జరుగుతుంది“ అన్నారు.
జయసుధ మాట్లాడుతూ – “కళలంటే సుబ్బరామిరెడ్డిగారికి ఎంతో మక్కువ. గతేడాది ఈ అవార్డ్స్ ఎంతో ఘనంగా జరిగాయి. ఈ ఏడాది కూడా వైజాగ్‌లో ఈ అవార్డ్స్ వేడుక ఘనంగా జరుగుతుంది. ప్రజలు వారికి నచ్చిన వారికి ఓటు వేసి సపోర్ట్ చేయాలి“ అన్నారు.