`ఆపాత మ‌ధురం` పుస్తకావిష్క‌ర‌ణ

మ్యూజికాల‌జిస్ట్ హాసంరాజా పాట‌ల‌, వాటి రాగాల‌పై రాసిన `ఆపాత మ‌ధురం` పుస్తకావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం ఇటీవ‌ల సికింద్రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో డా.కె.ఐ.వ‌రప్ర‌సాద్ రెడ్డి, ఎ.వి.గుర‌వారెడ్డి, సాక్షి ఎడిటోరియ‌ల్ డైరెక్ట‌ర్  కె.రామ‌చంద్ర‌మూర్తి, జె.మ‌ధుసూద‌న్ శ‌ర్మ‌, డా.సి.మృణాళిని, కె.ర‌ఘురామ‌కృష్ణంరాజు, ఆర్.పి.ప‌ట్నాయ‌క్‌, చంద్ర‌బోస్‌, డా.భార్గ‌విరావు, సినీ గీత శిరోమ‌ణి హాసం రాజా, సూరిబాబు త‌దిత‌రులు పాల్గొన్నారు. `ఆపాత మ‌ధురం` పుస్త‌కాన్ని ప‌ద్మ‌భూష‌న్ అవార్డ్ గ్ర‌హీత‌ డా.కె.ఐ.వ‌రప్ర‌సాద్ రెడ్డి ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా..

డా.కె.ఐ.వ‌రప్ర‌సాద్ రెడ్డి మాట్లాడుతూ – “రాజాగారు ప్ర‌తి పాట‌లోని సాహిత్యాన్ని విశ్లేషించి రాస్తే ప్ర‌తి పాట‌ల‌ను వినాల‌నే ఆస‌క్తిని అంద‌రిలో రేకెతిస్తుంది. ఆపాత మ‌ధురం పాట‌ల‌కు సంబంధించి ఫుల్ మీల్స్ వంటిది. ఇలాంటి పుస్త‌కాలు ఇంకెన్నో అవ‌స‌రం. మ‌రిన్ని సంపుటిలు వ‌స్తుంద‌ని భావిస్తున్నాను“ అన్నారు.

డా.సి.మృణాళిని మాట్లాడుతూ – “పాట‌ల‌కు సంబంధించిన ప‌రిశోధ‌న‌, త‌ర్కం, నైతిక‌త‌, క‌చ్చితత్వం, పాఠ‌కుడిని త‌న‌లో మిళితం చేసే గుణం ఈ పుస్త‌కంలో ఉంది. 1951-55 వ‌ర‌కు 21 చిత్రాల్లోని 108 గీతాల‌కు సంబంధించిన వాఖ్యాలున్నాయి. చిన్న ట్యూనుకు సంబంధించి ఆయ‌నెంతో ప‌రిశోధ‌న చేశారు. ఆపాత మ‌ధురంలో ప్ర‌స్తావించిన పాట‌ల్లో ఓ రాగంలో పాట ఉందో స్ప‌ష్టంగా, బ్యాలెన్స్‌డ్‌గా రాసుకుంటూ వ‌చ్చారు. సంగీతంతో పాటు సాహిత్యం గురించి కూడా స‌మ‌తూకంగా విశ్లేషించారు. రాజాగారిని మ‌న‌స్ఫూర్తిగా అభినందిస్తున్నాను“ అన్నారు.

డా.గుర‌వారెడ్డి మాట్లాడుతూ – “రాజాగారితో హాసం ప్ర‌తిక ప‌నిచేస్తున్న‌ప్ప‌టి నుండి మంచి ప‌రిచ‌యం ఉంది. విమ‌ర్శ‌ను నొప్పించేలా కాకుండా ఒక సద్విమ‌ర్శ‌గా, అంద‌రికీ న‌చ్చేలా చెప్ప‌డంలో రాజాగారు సిద్ధ‌హ‌స్తులు. పాట‌పై ఆయ‌న‌కు ఉన్న ప‌ట్టుతో ఎన్నెన్నో సూచ‌న‌లు చేస్తుంటారు. ఆ సూచ‌న‌లు ఎంతో మందికి మార్గ‌ద‌ర్శ‌కాలవుతుంటాయి. అలాంటి ఓ ప్ర‌య‌త్న‌మే ఆపాత మ‌ధురం అనే పుస్త‌కం. ఇలాంటి పుస్త‌కాలు మ‌రెన్నో రావాల‌ని కోరుకుంటూ ర‌చ‌యిత హాసం రాజాగారిని అభినందిస్తున్నాను“ అన్నారు.

డా.కె.రామ‌చంద్ర‌మూర్తి మాట్లాడుతూ – “నాకు ఇష్ట‌మైన జ‌ర్న‌లిస్టు హాసంరాజాగారు. మితభాషి, అత్మాభిమానం గ‌ల వ్య‌క్తి, చ‌దువుకున్న వ్య‌క్తి. తొలి కాపీని నాకు ఇచ్చింనందుకు థాంక్స్‌“ అన్నారు.

ఆర్.పి.ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ – “విశ్లేషించి మాట్లాడేటంత‌టి వాడిని కాను. రాజాగారిలాగా ర‌విరాజుగారు కూడా చాలా ప‌రిశోధ‌న‌లు చేస్తుంటారు. రాజాగారితో మంచి ప‌రిచ‌యం ఉంది. నాకొక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన‌వ‌న్నీ ఒక ఎత్తు అయితే, నా ప్రాజెక్ట్ ఒక ఎత్తు. సంగీతం పుట్టిన‌ప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు సంగీతం ఎలా రూపాంత‌రం చెందింది. దానికి కార‌ణ‌మైనవారు ఎవ‌రూ అనే దానికి సంబంధించి ఒక సీరియల్ చేయాలని కోరిక‌. అందుకు రాజాగారి వెనుక ప‌డుతున్నాను. తెలుగు సినిమా పాట క‌ళ క‌ళ‌లాడాలంటే రాజాగారి వంటి రీసెర్చ్ చేసే వ్య‌క్తి ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. రాజాగారు పాట‌ల‌పై ఎంతో రీసెర్చ్ చేశారు. ఆయ‌న మ‌న గుండెల్లో ఉండిపోతారు. ప్ర‌తి పాట కోసం ఆయ‌న చేసిన రీసెర్చ్‌లో ఎంతో నిజాయితీతో కూడిన క‌ష్ట‌ముంది. రాజాగారిని సామ‌ర్షి అని పిల‌వ‌వ‌చ్చున‌ని నేను భావిస్తున్నాను. తెలుగు పాట‌ను ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ చేస్తున్నందుకు రాజాగారికి అభినంద‌నలు“ అన్నారు.

చంద్ర‌బోస్ మాట్లాడుతూ – “నాకు, రాజాగారికి మంచి అనుబంధం ఉంది. రాజాగారు ప‌రిశోధ‌కుడు, విమ‌ర్శ‌కుడుగానే కాదు, మంచి పాట‌ల‌కు సృష్టిక‌ర్త‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  నేను పాట‌ల రాసే స‌మ‌యంలో అభినందించారు. చ‌రుక‌లు చేశారు. ప‌ద ప్రయోగాలు, భాష గురించి అనుమానాలుంటే రాజాగారికి ఫోన్ చేసి సందేహలు అడిగితే చెప్పేవారు. రాజాగారు నాకు భావ‌, రాగ, ల‌యాత్మ‌క ఆత్మ బంధువు. ఆ పాత మ‌ధురం అనే పుస్త‌కం రాసినందుకు ఆయ‌న‌కు థాంక్స్‌. భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని పుస్త‌కాలు రాయాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

హాసం రాజా మాట్లాడుతూ – “గోవింద‌రావు, నారాయ‌ణ‌రెడ్డి, ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యం, వ‌ర‌ప్ర‌సాద్ రెడ్డి అనే నలుగురు వ్య‌క్తుల ప్రోత్సాహంతో నేను ఇంత దూరం ప్ర‌యాణం సాగించాను. అలాగే ర‌వికిషోర్‌, భార‌వి ఇలా చాలా మంది మిత్రులు త‌మ స‌పోర్ట్‌ను అందించారు. అంద‌రి సహ‌కారం ఉంటే ఇలాంటి ప్ర‌యత్నాలు ఎన్నింటినో చేసి చ‌రిత్రలో నాకంటూ ఒక పేజీని క్రియేట్ చేసుకుంటాను“ అన్నారు.

 

Stills

About CineChitram

‘Hasam’ Raja’s ‘Aa Patha Madhuram’ book released

‘Aa Patha Madhuram’, a book written by the renowned musicologist ‘Hasam’ Raja, was recently unveiled at an event in Secunderabad.  The book launch ceremony was graced by Dr. KI Varaprasad Reddy, AV Gurava Reddy, K Ramachandra Murthy (Editorial Director of ‘Sakshi’ newspaper), J Madhusudhan Sharma, Dr. C Mrinalini, K Raghuramakrishnam Raju, RP Patnaik, Chandrabose, Dr. Bhargavi Rao, Suri Babu and others.

The book analyzes many songs and their musical styles.  It was unveiled on the hands of Dr. KI Varaprasad Reddy, who said, “If Raja garu analyzes the lyrics of each song, curiosity to listen to them would grow manifold.  This book is like full meals as far as songs are concerned.  More such books are needed to be written.  I hope this book will have many more volumes”.
Dr. C Mrinalini said, “This book has the qualities of research, logic, morality and conviction like the songs it talks about.  This book contains commentaries on 108 songs in 21 of the films released between 1951-55 .  Raja garu has done a lot of research even on small tunes.  It’s a structured and balanced analysis.  He has balanced his analysis of music with that of lyrics.  I whole-heartedly appreciate Raja garu”.
Dr. Guruva Reddy said, “I have known Raja garu since the time I worked with him for ‘Hasam’ daily.  His critiques don’t hurt; rather they are constructive.  He is adept at writing critiques that everybody can understand and appreciate.  With his knowledge, he gives suggestions, too.  His suggestions guide many.  This book is one such attempt”.
Dr. K Ramachandra Murthy said, “Raja garu is my favourite journo.  He is well-read, has self-respect, and loves the language.  I thank him for giving me the first copy”.
RP Patnaik said, “I am not big enough to do analysis.  I have a dream project.  This equals all the work I have done so far.  I want to make a series on how music has evolved over the decades and who all have contributed to it.  That’s why I am falling after Raja garu.  If the Telugu cinema song has to retain its glory, the kind of research that Raja garu does should continue to be done.  He will always be there in our hearts.  There is honesty in his efforts.  We can call him a Samarshi”.
Chandrabose said, “I have had a very good relationship with Raja garu.  He is not only a researcher and a critic, but also a creative force behind many songs.  He has many times appreciated my lyrics.  Whenever I used to have doubts about usages and language, I used to call him.  He is a spiritual relation to me when it comes to the meaning, music and rhythm of a song.  I thank him for writing the book ‘Aa Patha Madhuram’.  I wish that he writes many more books”.
Hasam Raja said, “I have come this far in my life because of the encouragement given by Govinda Rao, Narayana Reddy, SP Balasubrahmanyam and Varaprasad Reddy.  Likewise, friends like Ravi Kishore and Bharavi too have supported me.  If I have the support of people like these, I can write many books and create a page for myself in history”.

Stills

About CineChitram

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading