‘నేను-మనం-జనం’ (మార్పుకోసం యుద్ధం’ )
-జనసేన ఆలోచనావిధానం , పవన్ కళ్యాణ్
జనసేన సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఉద్దేశ్యంతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ‘నేను-మనం-జనం’ (మార్పుకోసం యుద్ధం’ అనే పుస్తకం రాస్తున్నారు.
ఒకరకంగా ఇది పార్టీ పెట్టటం వెనుక ఆయనకు ఉన్న ఉద్దేశ్యాన్ని , ప్రేరేపించిన పరిస్థితులను,చెయ్యాలనుకున్న కార్యక్రమాలను, సాధించాలనుకుంటున్న ఆశయాల్ని ప్రతిబింబించేదిగా ఉంటుంది. ఇంతకుముందు ప్రచురించిన ‘ఇజమ్’ పుస్తకం కంటే భిన్నంగా, సరళంగా, సూటిగా ఉండాలనే ప్రయత్నం తో ఈ పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ ప్రచురిస్తున్నారు. వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో ఈ పుస్తకాన్ని తీసుకురావాలనే ప్రయత్నంలో పార్టీ ఉంది.