Saptagiri, The man who knows his craft as comedian is all set to make his grand debut as a film’s main protagonist with ‘Saptagiri Express’. The upcomming project is being crafted on Sai celluloid creations under Dr. Ravi Kumar, the producer of the movie. Dialogue expert Trivikram’s close aide Arun Pawar helm’ed the megaphone to this up comming venture. The film has been picturized in Hyderabad and Poland. Cinematographer Ram Prasad captured the beauty of Poland in such a significant manner, that film makers expressed their confidence that the episode is going to be the highlight of the film. Recently Producer Dr. Ravikiran confirms that the team complete its Shooting part and proceed to post production works. The Theatrical trailer, and audio launch of the movie is going to be held soon. The star cast include Shiva Prasad, Ali, Posani Krishna Murali, and Shayaji Shinde.
Tags sapthagiri sapthagiri express
Check Also
టాలీవుడ్ క్రేజీ కమెడియన్ సప్తగిరి ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ తొలి ప్రయత్నంగా సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకం పై అత్యంత గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పావర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. దాదాపు మూడు నెలలకి పైగా హైదరాబాద్, పోలాండ్ లో ఈ సినిమా షూటింగ్ తాజాగా ముగిసింది. స్టార్ సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ కెమెరా వర్క్ ఈ సినిమాకు ప్రత్యేక అకర్షణగా నిలుస్తోందని చిత్ర బృందం తెలిపింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్ కి సోషల్ మీడియాలో విశేష ఆదరణ లభిస్తోంది. ఇదే ఊపుతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా ముగించి త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాత డాక్టర్ రవికిరణ్ తెలిపారు . అలానే సప్తగిరి ఎక్స్ ప్రెస్ టీమ్ త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్, ఆడియో లాంఛ్ ఈవెంట్స్ జరుపుకోనుందని తెలిపారు. శివప్రసాద్, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్ ఘోష్, షాయాజీ షిండే, తులసి, షకలక శంకర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచనా సహకారం: గోపిని రుణాకర్, ఆర్ట్: కుమార్, స్టంట్స్: జాషువా, డైలాగ్స్: రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల, మ్యూజిక్: బుల్గానిన్, ఎడిటర్: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్, ఆడిషనల్ స్టోరీ, స్క్రీన్ప్లే: ఎ సప్తగిరి ప్రాజెక్ట్, కో ప్రొడ్యూసర్: డా.వాణి రవికిరణ్.
Tags 'Saptagiri Express' sapthagiri