‘కాల్‌మనీ’ వ్యవహారం ఆమధ్య ఆంధ్ర ప్రదేశ్‌లో ఎటువంటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. విజయవాడలో జరిగిన యదార్ధ సంఘటనలు ఆధారంగా.. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఓ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఆ చిత్రం పేరు ‘కాల్‌మనీ’.
కృష్ణుడు, అంజనీకుమార్, సందీప్తి, నామాల మూర్తి ముఖ్య తారాగణంగా మక్కెన్ రంగా దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాల్‌మనీ’ చిత్రం ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ‘ఓ నగరంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ.. కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న ఓ డాన్ భరతం-`ఓ సిన్సియర్ పోలీసాఫీసర్ ఎలా పట్టాడన్నది క్లుప్తంగా కథాంశం. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు ముగించి త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.
ఈ చిత్రానికి ఎడిటర్: శ్రీనివాస్, కెమెరా: వీణ ఆనంద్, సంగీతం: అర్జున్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకత్వం: మక్కెన్ రంగా.