అమ్మోరు, అరుంధతి వంటి విజువల్ వండర్స్‌ని రూపొందించిన శత చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న మరో అద్భుత చిత్రం నాగభరణం. కన్నడ సూపర్‌స్టార్ విష్ణువర్థన్‌ను ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్‌తో క్రియేట్ చేయడం వండర్ అని అందరూ ప్రశంసించడం విశేషం. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో.. విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని జయంతి లాల్ గాడా సమర్పణలో సాజిద్ ఖురేషి, దవల్‌గాడా, సొహైల్ అన్సారీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. రమ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసిన 48 గంటల్లోనే 25 లక్షల వ్యూస్ రావడం విశేషం.కాగా ఈ చిత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పంపిణీ హక్కులను సురక్ష్ మీడియా అధినేత మల్కాపురం శివకుమార్ ఫ్యాన్సీ రేటుతో సొంతం చేసుకున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని ఆయన భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ ఈ చిత్రం తెలుగులో తప్పకుండా సంచలనం సృష్టించడం ఖాయం.ఈగ, బహుబలి చిత్రానికి అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌ని క్రియేట్ చేసిన మకుట ఈ చిత్రానికి వండర్‌ఫుల్ విజువల్ ఎఫెక్ట్స్ సృష్టిస్తున్నారు. ఒక గొప్ప చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడం ఆనందంగా వుంది అని తెలిపారు. దర్శకుడు కోడి రామకృష్ణ మాట్లాడుతూ పూర్వ జన్మలో తాను కోల్పోయిన అనుబంధాలు, ఆప్యాయతల్ని మరు జన్మలో ఓ యువతి ఏ విధంగా తిరిగి సొంతం చేసుకోగలిగింది? నాగభరణంతో ఆమెకున్న సంబంధమేమిటి? అనేది చిత్ర ఇతివృత్తం. మకుట సంస్థ సమకూర్చిన గ్రాఫిక్స్ హంగులు ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తాయి. పతాక ఘట్టాల్లో విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా కన్నడ నటుడు విష్ణువర్థన్‌ను పునఃసృష్టించాం. ఈ సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇటీవలే విడుదలైన ప్రచార చిత్రానికి చక్కటి ఆదరణ లభిస్తోంది అని తెలిపారు. రమ్య ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో దిగంత్, ముకుల్‌దేవ్, రవికాలే, అమిత్, రాజేష్ వివేక్, సాధు కోకిల, రంగాయన రఘు ఇతర పాత్రల్లో నటిస్తున్న సంచలనానికి ముస్తాబవుతున్న కోడి రామకృష్ణ విజువల్ వండర్ నాగభరణం