ప్రముఖ దర్శకుడు బాల తమిళంలో నిర్మించిన `చండివీరన్` తెలుగులో `కాళి` అనే పేరుతో విడుదలకు సిద్ధమవుతుంది. బి స్టూడియోస్ పతాకంపై ప్రముఖ దర్శకుడు బాల తెలుగులో సమర్పిస్తున్నారు. అధర్వ, ఆనంది, లాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని శర్కునమ్ దర్శకత్వంలో లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్, శ్రీ గ్రీన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎం.ఎం.ఆర్. ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా….
దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ – “టీజర్ చాలా బావుంది. చూడగానే టీజర్ నచ్చింది. ఒకప్పుడు తెలుగులో హృదయం సినిమాతో మంచి హీరోగా పేరు తెచ్చుకున్న హీరో మురళి తనయుడు అధ్వర్య ఈ సినిమాలో హీరోగా నటించారు. నిర్మాత మహేశ్వరరెడ్డి నాకు మంచి మిత్రుడు. సినిమా పెద్ద హిట్ కావాలి. భువనచంద్ర, చల్లా భాగ్యలక్ష్మి రాసిన పాటలు బావున్నాయి. అన్నీ ఎలిమెంట్స్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించే సినిమా అవుతుంది“ అన్నారు.
నిర్మాత ఎం.ఎం.ఆర్ మాట్లాడుతూ “తమిళంలో ప్రముఖ దర్శకుడు బాల నిర్మించిన చిగ్రాన్ని తెలుగులో బాలగారి సమర్పణలోనే కాళి పేరుతో విడుదల చేస్తున్నాం. ఫక్తు పల్లెటూరి చిత్రమిది. నీటి కోసం రెండు ఊర్ల మధ్య జరిగిన పోరాటం ఇందులో ఉంటుంది. సంక్రాంతి సంబరాల నుంచి, పల్లెటూరి సరసాలు, సరదాల వరకు అన్నీ ఇందులో ఉన్నాయి. తొలి సగం ఆద్యంతం కడుపుబ్బ నవ్విస్తుంది. రెండో సగం ఉత్కంఠభరితంగా సాగుతుంది. సన్నివేశాల మూడ్‌కు అనుగుణంగా సాగే పి.జి.ముత్తయ్య కెమెరా పనితనం మెప్పిస్తుంది. సామాజిక స్పృహతో సాగే చిత్రమిది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. అరుణగిరి అందించిన బాణీలు తప్పకుండా అందరికీ నచ్చుతాయి. సబేష్ – మురళి నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. అధర్వ, ఆనంది మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. తెలుగు వారికి కూడా తప్పకుండా కనెక్ట్ అయ్యే సినిమా, ఫిభ్రవరిలో మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.
పాటల రచయిత డా.చల్లా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ – “భువనచంద్రగారి వంటి సీనియర్ రైటర్‌గారు పాటలు రాసిన ఈ సినిమాలో నేను కూడా పాటలు రాయడం ఎంతో ఆనందంగా ఉంది. ఎసేయ్ మావా…అనే సాహిత్యంతో సాగే మాస్ సాంగ్‌ను రాశాను. హీరో తన స్నేహితులతో కలిసి పాడే పాట ఇది. పల్లెటూరు నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. మురళి, ఆనంది చక్కగా నటించారు. యాక్టర్ లాల్ నటుడు చాలా బావుంటుంది. ఆడియో తప్పకుండా అందరికీ నచ్చతుంది“ అన్నారు.
రాజశ్రీ, బోస్ వెంకట్, ఎన్. ఎలాంపర్తి, రవిచంద్రన్, శాంతకుమారి, కె.అనంతన్, అనంత పంగాలి, కలై, మదురై రమేవ్, జి.కె కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: పి.జి.ముత్తయ్య, సంగీతం: ఎస్.ఎన్.అరుణగిరి, నేపథ్య సంగీతం: సబేష్ మురళి, మాటలు: ఎం.రాజశేఖర్ రెడ్డి, పాటలు: భువనచంద్ర, శివగణేశ్, డా.చల్లా భాగ్యలక్ష్మి, ఆర్ట్: ఎ.ఆర్. మోహన్, ఎడిటింగ్: ఎ.రాజా మొహమ్మద్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎ.శర్కునమ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రఘు, నిర్మాత: ఎం.ఎం.ఆర్.