శ్రీనివాస్ని రెడ్డి-పూర్ణ జంటగా తెరకెక్కిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “జయమ్ము నిశ్చయమ్ము రా” విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ మంచి విజయం సాధించే దిశగా దూసుకుపోతొంది. ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్లా అనూహ్యమైన స్పందన వస్తోంది. అయితే.. ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు, విమర్శకులు “సినిమా చాలా బాగుంది” కానీ.. ‘లెంగ్త్’ కాస్త ఎక్కువయిందని అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు.
వారి అభిప్రాయాల్ని గౌరవించిన చిత్ర దర్శకుడు శివరాజ్ కనుమూరి వెంటనే సినిమా నుంచి 15 నిమిషాల నిడివి తొలగించారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శివరాజ్ కనుమూరి మాట్లాడుతూ.. “మా సినిమా విడుదలకు రెండ్రోజుల ముందే “పబ్లిక్ ప్రీమియర్స్” నిర్వహించాము, ఆ ప్రీమియర్స్ కి మా మీడియా మిత్రులను కూడా ఆహ్వానించాం. సినిమా చూసిన వాళ్ళందరూ “సినిమా చాలా బాగుంది” అంటూ మా యూనిట్ ని అభినందించారు. అయితే.. ఈ చిత్రాన్ని చూసిన మీడియా మిత్రుల సలహా మేరకు 15 నిమిషాల నిడివి మేరకు సినిమాను కత్తిరించాము. ఇప్పటికే మా చిత్రాన్ని విశేషంగా ఆదరిస్తున్న ప్రేక్షకులు.. నిడివి తగ్గించిన తర్వాత పోసాని-కృష్ణ భగవాన్ ల కామెడీ ఎపిసోడ్స్, జోగి బ్రదర్స్ పంచ్ డైలాగ్స్ ను ప్రేక్షకులు ఇంకా బాగా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. సినిమా చూసినవారందరూ “అచ్చమైన తెలుగు సినిమా చూసిన భావన కలుగుంది” అంటూ సోషల్ మీడియాలో మా సినిమాపై ప్రశంసలు కురిపించడమే కాకుండా చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులందరు కలిసి మా చిత్రాన్ని చూస్తున్నందుకు మా సినిమా యూనిట్ తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం” అన్నారు.
You must be logged in to post a comment.