ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై `ప్రేమిస్తే`, `జర్నీ`, `పిజ్జా` వంటి బ్లాక్‌బస్టర్లను అందించిన సురేష్ కొండేటి సమర్పణలో తెరకెక్కిన సినిమా -`మెట్రో`. రజని తాళ్లూరి నిర్మాత. ప్రస్తుతం నగరాలలో జరుగుతున్న చైన్ స్నాచింగ్‌లను కళ్ళకు కడుతూ.. తెరకెక్కించిన చిత్రమిది. ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్‌కి, పోస్టర్లకు, పాటలకు చక్కని స్పందన వచ్చింది. అన్ని పనులు పూర్తిచేసుకున్న సినిమా మార్చి 17న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం 250 థియేటర్లలలో రిలీజ్ అవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ ` మెట్రో పాటలు, పోస్టర్లు, ట్రైలర్లకు ఏ స్థాయి రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మెట్రోకు వస్తోన్న రెస్పాన్స్ చూసి ఈ చిత్రాన్ని 250 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. విడుదలకు ఒక రోజు ముందుగానే 80 శాతం థియేటర్లు మొత్తం ఫుల్ అయ్యాయి. ఈ విషయం ఇప్పుడు ఇండస్ర్టీని, అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలో నేను చేసిన సినిమాలు 30 శాతం ఫుల్ అయ్యేవి. ఈసారి ఆ శాతాన్ని దాటి అదనంగా 50 శాతం ఫుల్ కావడం చాలా హ్యాపీగా ఉంది. మళ్లీ `జర్నీ` లాంటి సంచలన విజయాన్ని నమోదు చేయడం ఖాయం` అని అన్నారు.
నిర్మాత రజని రామ్ మాట్లాడుతూ “ భారీ అంచనాలతో రేపు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. వాళ్ల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది. ఇప్పటికే ట్రైలర్ , పాటలకు వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే హిట్ కొట్టడం ఖాయమనిస్తుంది` అని అన్నారు.
You must be logged in to post a comment.