భద్ర, తులసి, సింహా, లెజెండ్, సరైనోడు వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో తొలి చిత్రం అల్లుడు శీనుతో మాస్ హీరోగా తెలుగు సినిమాకు పరిచయమై తనను తాను ప్రూవ్ చేసుకున్నబెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథనాయకుడుగా ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌ఫై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాతగా ప్రొడక్షన్ నెం.2 చిత్రం ఇటీవల లాంచనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. సినిమా రేపటి(నవంబర్ 20) నుండి రెగ్యులర్ చిత్రీకరణను జరుపుకోనుంది. ఈ సందర్భంగా…
చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ – “మా ద్వారక క్రియేషన్స్ బ్యానర్లో బోయపాటి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది. డైరెక్టర్ బోయపాటి శ్రీను బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో తన మార్కు ఎంటర్టైన్మెంట్తో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ కొత్త చిత్రాన్ని హై బడ్జెట్‌తో రూపొందించనున్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరికొత్త లుక్‌తో కనపడుతూ సాయి శ్రీనివాస్ పాత్ర స్టయిలిష్‌గా, పవర్‌ఫుల్‌గా ఉండేలా బోయపాటి శ్రీను ప్లాన్ చేశారు. ఎం.రత్నం ఈ చిత్రానికి మాటలు, రిషి పంజాబి సినిమాటోగ్రఫీ, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్నారు. నవంబర్ 20 నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. అందులో భాగంగా హీరో, హీరోయిన్లపై కీలక సన్నివేశాలను హైదరాబాద్‌లో షూట్ చేస్తున్నాం. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హై స్టాండర్డ్స్‌లో సినిమాను తెరకెక్కించేలా సన్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.
ఈ చిత్రానికి ఆర్ట్ః సాహి సురేష్, ఎడిటర్ః కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్ః రామ్‌లక్ష్మణ్, మాటలుః ఎం.రత్నం, సినిమాటోగ్రఫీః రిషి పంజాబి, మ్యూజిక్ః దేవిశ్రీప్రసాద్, నిర్మాతః మిర్యాల రవీందర్ రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంః బోయపాటి శ్రీను
Tags 'Miryala Ravinder Reddy' bellamkonda sreenivas Boyapati Srinu devi sri prasad Kotagiri Venkateshwara Rao M Rathnam rakulpreet singh Ram Laxman Rishi Punjabi Sahi Suresh
Check Also
ఫణి ఫిలిం ఫ్యాక్టరీ “స్ట్రేంజర్” సెకండ్ షెడ్యూల్ పూర్తి !!
స్వీయ దర్శకత్వంలో యువ ప్రతిభాశాలి ఫణికుమార్ అద్దేపల్లి నిర్మిస్తున్న చిత్రం “స్ట్రేంజర్”. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో.. గోవా బ్యాక్ డ్రాప్ …