మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ప్రతిష్టాత్మకమైన గీతాఆర్ట్స్ బ్యానర్‌పై స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, నిర్మాత ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న స్టయిలిష్ ఎంటర్ టైనర్ `ధృవ`.
హై బడ్జెట్, టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్‌ను ఇచ్చారు. సినిమా ప్రారంభం నుండి సినిమాపై భారీ క్రేజ్ నెలకొంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్- పి.యస్.వినోద్, మ్యూజిక్ – హిప్ హాప్ తమిళ , ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్, ఆర్ట్ – నాగేంద్ర, ఎడిటర్ – నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – వి.వై. ప్రవీణ్ కుమార్, ప్రొడ్యూసర్స్ – అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్, దర్శకుడు – సురేందర్ రెడ్డి.