రిచాపనై, బాహుబలి ప్రభాకర్, పృథ్వీ, సప్తగిరి, బ్రహ్మాజీ తదితరులు ప్రధాన తారాగణంగా సుఖీభవ మూవీస్ బ్యానర్‌పై వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఎ.గురురాజ్ నిర్మిస్తున్న చిత్రం `రక్షకభటుడు`. ఇటీవల ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదలై ప్రేక్షకులను నుండి చాలా మంచి స్పందనను రాబట్టుకుంది. చిత్రీకరణ దశలోని ఈ సినిమా గురించి….
దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల మాట్లాడుతూ – “నా దర్శకత్వంలో వచ్చిన రక్ష, జక్కన్న సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇప్పుడు చేస్తున్న రక్షకభటుడు ఈ రెండు సినిమాలను మించేలా రూపొందిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. రీసెంట్‌గా విడుదలైన మోషన్ పోస్టర్‌కు మంచి ఆదరణ లభించింది. సినిమా తదుపరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జనవరి నుండి జరుగుతుంది. సినిమాలో చివరి పదిహేను నిమిషాలు తప్ప, మిగిలినదంతా ఎంటర్‌టైనింగ్‌వేలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ `రక్షకభటుడు`. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఫిభ్రవరి నెలాఖరున సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం“ అన్నారు.
నిర్మాత ఎ.గురురాజ్ మాట్లాడుతూ – “ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న రక్షకభటుడు సినిమా జనవరి 2 నుండి నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకోనుంది. ఇటీవల విడుదలైన ఆంజనేయస్వామి పోలీస్ గెటప్‌లో ఉండే మోషన్ పోస్టర్‌కు ఆడియెన్స్ మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఈ ఆంజనేయ స్వామి క్యారెక్టర్ చేసిన నటుడెవరో మేం ఎక్కడా రివీల్ చేయలేదు. సాధారణంగా ఆంజనేయుడు గెటప్ కంటే పోలీస్ వేషధారణలోని ఆంజనేయస్వామి గెటప్ కావడంతో.. ఆ గెటప్ చేసింది ఎవరా అని ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది. ఈ క్యారెక్టర్‌లో ఓ స్పెషల్ స్టార్ నటించాడని చెప్పాం కానీ, అ స్టార్ ఎవరో మేం ఎక్కడా రివీల్ చేయలేదు. అయితే ఆ క్యారెక్టర్ ఎవరు చేసి ఉంటారనే దానిపై చాలా రకాలైన వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పోలీస్ ఆంజనేయుడు క్యారెక్టర్ వేసిన నటుడెవరనే సస్పెన్స్‌ను సినిమా విడుదల వరకు మెయిన్‌టెయిన్ చేస్తాం. పోలీస్ గెటప్ వేసిన ఆ స్పెషల్ స్టార్ ఎవరో చెబితే అందరూ హ్యాపీగా ఫీలవుతారు“ అన్నారు.
రిచాపనై, బాహుబలి ప్రభాకర్, పృథ్వీ, సప్తగిరి, బ్రహ్మాజీ, ధనరాజ్, అదుర్స్ రఘు, నందు, చిత్రం శ్రీను, గురురాజ్, గౌతంరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో ప్రత్యేకపాత్రలో ఓ స్పెషల్‌స్టార్ నటించనున్నాడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః మల్హర్ భట్ జోషి, ఆర్ట్ః రాజీవ్‌నాయర్, ఎడిటింగ్ః అమర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః జె.శ్రీనివాసరాజు, ప్రొడ్యూసర్ః ఎ.గురురాజ్, రచన, దర్శకత్వంః వంశీకృష్ణ ఆకెళ్ల.