ఔత్సాహికులైన గాయ‌నీగాయ‌కుల‌కు ల‌హ‌రి మ్యూజిక్ ఆహ్వానం..!

 

ఆదిత్య మూజిక్ వారు తమ ప్రేమ౦ సినిమాలోని ఎవరే గీతాన్ని సాధారన జననీక౦తో పాడి౦చి బాగా ప్రాచుర్యాన్ని స౦పాది౦చుకు౦ది.

అసలు కవర్ అ౦టే ఏ౦టి..

ఒక సినిమాలో మ౦చి గీతాన్ని ఎన్నుకుని .. అచ్చమైన గాయకులు కాకు౦డా ఔత్సాహిక గాయకులెవరైనా ఆ గీతాన్ని పాడి ఆ గానానికి మరో రూపాన్ని ఇవ్వడ౦

ఇప్పుడు లహరి వారు కూడా ఈ విధానాన్ని పాటి౦చదలుచుకున్నారు  . వారి ప్రకటనను గమని౦చ౦డి  .. ఈ అవకాశాన్ని సద్వినియోగ౦ చేసుకో౦డి  ..

 

ఔత్సాహికులైన గాయ‌నీగాయ‌కుల‌కు ల‌హ‌రి మ్యూజిక్ సంస్థ రెండు అరుదైన అవ‌కాశాలు క‌ల్పిస్తుంది.

 

1) ల‌హ‌రి యూట్యూబ్ ఛాన‌ల్ లో క‌నిపించాల‌నుకుంటే…ఎవ‌రైనా ఆస‌క్తి గ‌ల సింగ‌ర్స్ త‌మ పాట‌ను వీడియో రూపంలో పంపిస్తే అలా వ‌చ్చిన వాటిలో బెస్ట్ సాంగ్ ను సెలెక్ట్ చేసి ఎంపిక చేస్తారు. అలా ఎంపికైన పాట‌ల‌ను ల‌హ‌రి మ్యూజిక్ ఛాన‌ల్ తో పాటు ఎఫ్.ఎం లో కూడా ప్ర‌సారం చేస్తారు.

 

2) పాట‌ను వీడియో రూపంలో చిత్రీక‌రించేందుకు ఎవ‌రైనా ప్రొడ్యూస‌ర్ ఉంటే బాగుంటుంది అని ఆలోచించే వారి కోసం ప్రొడ్యూస్ చేయ‌డానికి కూడా ల‌హ‌రి మ్యూజిక్ రెడీగా ఉంది. రికార్డ్ ట్రాక్ ను పంపిస్తే…వాటిలో ఉత్త‌మ‌మైన ఆడియోను సెలెక్ట్ చేసి అవ‌కాశం క‌ల్పిస్తారు.

 

అయితే…సింగ‌ర్స్ ల‌హ‌రి మ్యూజిక్ ఆల్బ‌మ్ లో పాట‌ను మాత్ర‌మే సెలెక్ట్ చేసుకోవాలి. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం…ఔత్సాహికులైన గాయ‌నీగాయ‌కులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోండి..! మీ ప్ర‌తిభ‌ను ప్ర‌పంచానికి తెలియ‌చేయండి..!

 

About CineChitram

Check Also

`గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` లాయ‌ల్టీ కాంటెస్ట్‌

Leave a Reply