మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, డిస్ట్రిబ్యూటర్, ప్రముఖ నిర్మాత హెచ్.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ 75 కోట్ల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వేల్యూస్‌తో శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్న చిత్రం ‘జాగ్వార్’. హెచ్.డి.కుమారస్వామి సమర్పణలో చన్నాంబిక ఫిలింస్ పతాకంపై రాజమౌళి శిష్యుడు ఎ.మహదేవ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జాగ్వార్‌స. అక్టోబర్ 6న విడుదలైంది. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను చిత్రయూనిట్ సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించింది.
ఈ సందర్భంగా..
హీరో నిఖిల్‌కుమార్ మాట్లాడుతూ – “హీరోగా నా తొలిచిత్రం జాగ్వార్‌ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. నాన్నగారు నాకు చాలా మంచి సినిమాను ఇచ్చారు, అందుకు ఆయనకు థాంక్స్. విజయేంద్రప్రసాద్‌గారు మంచి కథను ఇవ్వగా మహదేవ్‌గారు సినిమాను బాగా డైరెక్ట్ చేశారు. మంచి సీనియర్ టెక్నిషియన్స్, నటీనటులు సినిమాకు పనిచేశారు. తెలుగులో చేసిన సినిమాను కన్నడలో కూడా విడుదల చేశామని చెప్పాలి. ఈ సినిమాకు స్టోరీయే హీరో. భవిష్యత్‌లో మంచి పెర్‌ఫార్మెన్స్ సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఆయన రెండు వందల సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్‌గా ఇకపై నేను చేసే చిత్రాలకు నాన్నగారే కథను నిర్ణయిస్తారు.నేను నా తదుపరి సినిమాకు సంబంధించిన చర్చలు చేస్తూ పూరిగారిని, సురేందర్‌రెడ్డిగారిని కలిశాను. అయితే ఏ సినిమా చేయాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఫైనల్ కాగానే వాటి వివరాలను తెలియజేస్తాం“ అన్నారు.
హెచ్.డి.కుమారస్వామి మాట్లాడుతూ – “జాగ్వార్ చిత్రాన్ని ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో ఒకేసారి విడుదల చేశాం. ఈ సినిమాతో మా అబ్బాయిని తెలుగు ప్రజలు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు. నిఖిల్ పెర్‌ఫార్మెన్స్ బావుందని అందరూ అప్రిసియేట్ చేశారు. కర్ణాటకలో ఈ సినిమాయే అన్నీ రికార్డులను క్రాస్ చేసింది. తెలుగులో మేం ఏ గోల్ అయితే రీచ్ కావాలనుకున్నామో దాన్ని రీచ్ అయ్యామనే భావిస్తున్నాను. నేను మా అబ్బాయితో సినిమా చేస్తున్నానని కాకుండా మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. జనవరిలో నిఖిల్ హీరోగా సినిమాను స్టార్ట్ చేస్తాం. ఆలోపు జగపతిబాబుగారితో ఓ సినిమా చేస్తున్నాం. నాకు ప్రధానంగా స్క్రిప్ట్ నచ్చాలి..అప్పుడు డైరెక్టర్ కొత్తవాడా, అనుభవమున్నవాడా అని చూడను“ అన్నారు.
జగపతిబాబు మాట్లాడుతూ – “తెలుగు ప్రేక్షకులను నమ్మి ఇంత భారీ బడ్జెట్‌తో, వరల్డ్‌లోని టాప్ టెక్నిషియన్స్‌తో ఈ సినిమాను నిర్మించారు. నిఖిల్ కూడా చాలా మంచి నటనను కనపరిచాడు. మహదేవ్ సినిమాను బాగా డైరెక్ట్ చేశాడు. కుమారస్వామిగారు తెలుగులో ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. జగపతి పిక్చర్స్ సమర్పలో చన్నాంభిక ఫిలింస్ నిర్మాణంలో కుమారస్వామిగారు నిర్మించే చిత్రంలో నేను లీడ్ రోల్‌లో నటించబోతున్నాను. అరవైయేళ్ల వయసుండే వ్యక్తి, పటేల్ సార్ అనే పేరుతో రానున్న ఈ సినిమాలో వైల్డ్ క్యారెక్టర్‌లో కనపడతాను. ఈ సినిమాను 37 రోజుల్లో పూర్తి చేయాలనుకుంటున్నాం. వివరాలను త్వరలోనే తెలియజేస్తాం“ అన్నారు.
దర్శకుడు ఎ.మహదేవ్ మాట్లాడుతూ – “జాగ్వార్ రెండేళ్ల శ్రమ. తెలుగు, కన్నడలో సినిమా సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. నిఖిల్‌కుమార్ కన్నడ అబ్బాయి అయినా తెలుగులో ఎస్టాబ్లిష్ కావడం తనకు తెలుగు సినిమా అంటే ఎంతో ఇష్టమో తెలుస్తుంది. ఈ సినిమాను తమ సినిమాగా భావించి సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్“ అన్నారు.
విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ – “మంచి కథ కంటే దాన్ని తెరకెక్కించేటప్పుడే ఉండే బాధలే వర్ణనాతీతం. సాధారణంగా ఈ సినిమాను ఐదు, పది, పదిహేను, ఇరవై కోట్లు ఖర్చు పెట్టి తీసుండవచ్చు. కానీ క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌కాకుండా డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టి సినిమా చేయడం కుమారస్వామిగారికి సినిమాపై ఉన్న ప్యాషన్ తెలుస్తుంది. నిఖిల్ సినిమా కోసం ఎంత శ్రమించాడో తెలుసు. అలాగే దర్శకుడు మహదేవ్ సినిమాను అందంగా తీర్చిదిద్దాడు. సినిమాను సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్“ అన్నారు.
నిఖిల్‌కుమార్, దీప్తి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రఘుబాబు, బ్రహ్మానందం, సంపత్, ఆదిత్యమీనన్, భజ్రంగ్ లోకేష్, అవినాష్, వినాయక్ జోషి, ప్రశాంత్, సుప్రీత్ రెడ్డి, రావు రమేష్, రమ్యకృష్ణ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: హెచ్.డి. కుమారస్వామి, కథ: విజయేంద్ర ప్రసాద్, సినిమాటోగ్రఫి: మనోజ్ పరమహంస, మ్యూజిక్: యస్.యస్. థమన్, ఆర్ట్: నారాయణరెడ్డి, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, ఫైట్స్: రవివర్మ, రామ్-లక్ష్మణ్, కలోయాన్ (బల్గేరియా), సెల్వ, కో డైరెక్టర్: అమ్మినేని మాధవసాయి, నిర్మాత: శ్రీమతి అనితా కుమారస్వామి, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: ఎ. మహదేవ్.