ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై `ప్రేమిస్తే`, `జర్నీ`, `పిజ్జా` వంటి బ్లాక్‌బస్టర్లను అందించిన సురేష్ కొండేటి సమర్పణలో రజనీ తాళ్లూరి నిర్మించిన `మెట్రో` చిత్రం ఈ శుక్రవారం విడుదలై విజయవంతంగా ఆడుతోంది. చైన్ స్నాచింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులకు బ్రహ్మరధం పడుతున్నారు. హౌస్ ఫుల్ కలెక్షన్లతో థియేటర్లలలో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ఆదివారం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ ` చాలా రోజుల తర్వాత `మెట్రో` తో మంచి సక్సెస్ అందుకున్నాం. ప్రేమిస్తే, జర్నీ , సలీమ్ తరహాలో మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంతో ఆదరిస్తున్నారు. సినిమాలో అంతా కొత్త వాళ్లైనా ఇంత ఆదరణ లభిస్తుందంటే కారణం. అందులో ఉన్న కంటెట్ వలనే. మంచి కథాంశం ఉన్న చిత్రాలు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి నా విషయంలో ప్రూవ్ అయింది. అందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ సినిమా ఇంత సక్సెస్ అయిందంటే కారణం మీడియానే. సినిమా చూసి అన్ని వెబ్ సైట్లు మూడుకు పైగా రేటింగ్స్ ఇచ్చి సినిమాకు మరింత బూస్ట్ నిచ్చాయి. ఈ చిత్రాన్ని `చుట్టలబ్బాయి` చిత్రం నిర్మాత రజనీ రామ్, నేను కలిసి రైట్స్ దక్కించుకున్నాం. ఇప్పుడు మా నమ్మకం నిజమైనందుకు సంతోషంగా ఉంది. డైరెక్టర్ ఆనంద్ కృష్ణ ప్రతీ సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. కెమెరా, సినిమా టోగ్రఫీ పనితనం హైలైట్ గా నిలిచింది. ఆనంద్ కృష్ణ భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేయాలని..శిరీష్ పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నా` అని అన్నారు.
చిత్ర దర్శకుడు ఆనంద్ కృష్ణ మాట్లాడుతూ ` నా మొదటి సినిమానే తెలుగు, తమిళ్ లో పెద్ద విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. సినిమా చూసిన దర్శకులు మురగదాస్, గౌతమ్ మీనన్ ప్రశంసించారు. ఆ అనుభూతి ఎప్పటికీ మర్చిపోలేను. చైన్ స్నాచింగ్ వాస్తవ సంఘటలను బేస్ చేసుకుని కథ సిద్దం చేశా. మొదట్లో కొంచెం టెన్షన్ పడ్డా. కానీ అవుట్ ఫుట్ చూసుకుని సక్సెస్ అవుతానని కాన్ఫిడెన్స్ పెరిగింది. ప్రస్తుతం ఓ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని రెడీ చేస్తున్నా. తెలుగులో కూడా సినిమాలు చేయాలనుకుంటున్నా` అని అన్నారు.
చిత్ర హీరో శిరష్ మాట్లాడుతూ ` హీరోగా నాకిది మొదటి సినిమా. యాక్టింగ్ కోర్స్ చేసి ఇటువైపు వచ్చా. ఆరంభంలోనే క్రైమ్ థ్రిల్లర్ లో నటించే అవకాశం వచ్చింది. ఆనందర్ కృష్ణ ఆ పాత్ర కోసం చాలా మందిని ఆడిషన్స్ చేశారు. కానీ ఎవ్వరూ ఆ పాత్రకు యాప్ట్ కాకపోవడంతో నన్ను పిలిచి ఆడిషన్ చేసి ఎంపిక చేసుకున్నారు. సినిమా సెట్స్ కు వెళ్లిన తర్వాత కెమెరా ముందు కొంచెం టెన్షన్ ఫీలయ్యా. తర్వాత రెండు రోజులు షూట్ తర్వాత టెన్షన్ పోయింది. సీన్స్ అన్నింటీని ఫ్రీగా చేయగలిగాను. షూటింగ్ సమయంలో నా కోస్టార్స్ మంచి ఎంకరేజ్ చేశారు. తొలి సినిమానే రా మెటిరీయల్ సినిమా లో నటించడం మంచి ఎక్స్ పీరియన్స్ ను ఇచ్చింది. డైరెక్టర్ ఆ పాత్రను చాలా సెటిల్డ్ గా చేయించారు. మిగతా పాత్రల్లో కూడా ఎమెషన్స్ అన్నీ బాగా పండాయి. అందుకే ఇంత పెద్ద సక్సెస్ ను అందుకున్నాం. ప్రస్తుతం `రాజా రంగీత్` అనే సినిమా చేస్తున్నా. మంచి స్టోరీ అది. హ్యారీస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నాలుగు రోజులు షూటింగ్ మినాహా అంతా పూర్తయింది. ఏప్రిల్ 14న ఆ సినిమా ఫస్టు లుక్ రిలీజ్ చేస్తున్నాం. అదే నెలాఖరున సినిమా కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం కొన్ని కథలు కూడా విన్నా. వాటి పూర్తి వివరాలు త్వరలో చెబుతా` అని అన్నారు.