స౦క్రా౦తికి రానున్న అనుపమ, శర్వాన౦ద్ ల ‘శతమాన౦భవతి’

ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాత గా పేరున్న దిల్ రాజు నిర్మాణం లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరో గా వేగేశ్న సతీష్ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం “శతమానం భవతి”.  అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి 2017 కి విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రం మొదటి టీజర్ ను దసరా పండుగ సందర్భం గా అక్టోబర్ 10 సాయంత్రం విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. 
” శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ లో వచ్చిన బొమ్మరిల్లు చిత్రం తండ్రీ కొడుకుల మధ్య ఉండే సంబంధాన్ని అందం గా ప్రతిబింబించింది. ఇప్పుడు శతమానం భవతి  తాతా మనవళ్ల  మధ్య ఉండే బంధాన్ని చూపే ఒక అందమైన కుటుంబ కథా చిత్రం. మా బ్యానర్ కి బొమ్మరిల్లు  సినిమా ఎంత పేరు తెచ్చిపెట్టిందో, ఈ శతమానం భవతి చిత్రం అంతటి పేరు ను తెస్తుంది అని నమ్మకం ఉంది”, అని  దిల్ రాజు తెలిపారు.  
ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తి కాగా, రెండవ షెడ్యూల్ నవంబర్ చివరి వరకు సాగుతుంది. హైదరాబాద్ మరియు గోదావరి జిల్లాల పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం లో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్ , జయసుధ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 
ఈ చిత్రానికి దర్శకత్వం : సతీష్ వేగేశ్న , ఎడిటింగ్ మధు , సినిమాటోగ్రఫి సమీర్ రెడ్డి, సంగీతం మిక్కీ జె మేయర్, నిర్మాతలు : రాజు , శిరీష్ 

About CineChitram

Check Also

`కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త` సెన్సార్ పూర్తి…ప్ర‌పంచ వ్యాప్తంగా మార్చి 3న గ్రాండ్ రిలీజ్‌

Leave a Reply