వశిష్ఠ సినీ అకాడమీ బ్యానర్‌పై రజిత్, షామిలి, నిషా, విజయ్‌కుమార్, షఫీ, జ్యోతి, శంకరాభరణం రాజ్యలక్ష్మి, కాశీ విశ్వనాథ్ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం ‘శ్రీరామరక్ష’. రాము దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్రభాత్ వర్మ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్, సాంగ్ రిలీజ్ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. హీరో సుధీర్‌బాబు టీజర్‌ను విడుదల చేయగా, హీరో సునీల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీరామరక్ష` టీజర్ చూస్తున్నప్పుడు `సీతారామయ్యగారి మనవరాలు` అనే సినిమాను చూస్తున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో అలాంటి ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా యూనిట్‌కు టైటిల్‌కు తగిన విధంగానే శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని హీరో సునీల్ తెలిపారు. చిన్న సినిమాలు ప్రేక్షకుల్లోకి వెళ్లాలంటే అందరి సహకారం అవసరం అనిపించడంతో కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాను. ఈ మధ్య విడుదలైన చిన్న సినిమాలు మంచి విజయాలను సాధిస్తున్నాయి. `శ్రీరామరక్ష` టీజర్ చూస్తుంటే విజువల్స్ బావున్నాయి. కంటెంట్ బేస్డ్ మూవీగా తెలుస్తుంది. సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నానని హీరో సుధీర్‌బాబు అన్నారు. టీజర్ చాలా బావుంది. సినిమా ఎలా ఉంటుందోనని ఆసక్తి క్రియేట్ చేయడంలో దర్శకుడు, నిర్మాత, యూనిట్ సక్సెస్ అయినట్లు కనపడుతుందని పల్నాటి సూర్యప్రతాప్ తెలియజేశారు.
నేను రచయితగా ఈ స్టేజ్‌పై నిలబడటానికి కారణమైన సుకుమార్‌గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అమ్మ, నాన్న, గురువు అనేవాళ్లు మనకు కనిపించే శ్రీరామరక్ష. అయితే దైవం, ఇప్పుడు మా సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి సపోర్ట్ చేసిన సుధీర్‌బాబు, హీరో సునీల్‌వంటి వారు కనిపించని శ్రీరామరక్ష. దర్శక నిర్మాతలకు థాంక్స్ అని రైటర్ కేధారినాథ్ అన్నారు. సునీల్‌గారు సినిమా చూసి సీతారామయ్య మనవరాలు సినిమాతో పోల్చారు కానీ సినిమా సీతారామయ్య మనవడిది. సినిమా చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుందని నిర్మాత ప్రభాత్‌వర్మ చెప్పారు. రజిత్, షామిలి సహా ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ బాగా సపోర్ట్ చేశారు. అందరికీ థాంక్స్ అని డైరెక్టర్ రాము చెప్పారు. మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు హీరో రజిత్, హీరోయిన్ షామిలి సౌందరాజన్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆనంద్ రవి, మ్యూజిక్ డైరెక్టర్ సాబువర్గీస్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి మాటలు, సాహిత్యం: పరిమి కేథార్‌నాథ్, మ్యూజిక్: సాబు వర్గీస్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: వైధి, సినిమాటోగ్రఫీ: ఎస్.మురళీమోహన్‌రెడ్డి, ఫైట్స్: రామ్ సుంకర, సహ నిర్మాతలు: గమిడి సత్యం, పి.వి.రంగరాజు, నిర్మాత: ప్రభాత్ వర్మ, స్టోరీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాము.