మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన `ఖైదీ నంబర్ 150`వ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రిలీజ్ కు ముందు అంచనాలకు తగ్గట్టే రికార్డుల్ని నమోదు చేసే దిశగా మూవీ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తోంది. క్లాస్ మాస్ అందరిని ఆకట్టుకుంది. ఇక బాస్ సినిమా చూసి టాలీవుడ్ ప్రముఖులు కూడా ట్వీట్ చేయకుండా ఉండలేకపోయారు. సినిమా రిలీజ్ కు ముందు నాగార్జున, మోహన్ బాబు, రాధిక వంటి సినీయర్ నటులంతా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇక రిలీజ్ తర్వాత తమ స్టైల్లో చెలరేగిపోతున్నారు. “బాస్ ఈజ్ బ్యాక్..చిరంజీవి గారు తిరిగి ఇండస్ట్రీకి వచ్చినందుకు థాంక్స్. పదేళ్ల పాటు మిమ్మల్ని మిస్ అయ్యాం. చరణ్ తొలి సినిమాతో నిర్మాతగా రికార్డులు సృష్టిస్తున్నందుకు శుభాకాంక్షలు. వినయ్ గారు కుమ్మేశారు. ఈ సినిమా మీకన్నా ఇంకెవ్వరూ బాగా చేయలేరంటూ.. దర్శకుడు రాజమౌళి ట్వీటారు.
ఇక మెగాభిమాని హరీశ్ శంకర్ అయితే ఏకంగా తన ప్రోఫైల్ పిక్ గా చిరు ఫోటో పెట్టేసాడు. బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. అన్ని ఏరియాల్లో రప్ఫాడిస్తున్నారు మెగాస్టార్. ఆయన మరిన్ని సంవత్సరాలు పాటు మనల్ని అలరించాలన్నారు. అలాగే దర్శకుడు మారుతి.. అయితే ఖైదీ నంబర్ 150…. 150వ సినిమా మాత్రమే కాదు..తెలుగు సినిమాకు మంచి రోజులు కూడా వెనక్కి తెచ్చిన సినిమా అంటూ దర్శకుడు మారుతి ట్వీట్ చేశారు.
కూకట్ పల్లిలో ఈ సినిమా చూశాను. ఎక్స్ ట్రార్డినరీ సినిమా. తొమ్మిదేళ్ల తర్వాత బాస్ ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా, డ్యాన్స్, ఫైట్స్ చేశారు. మరో బ్లాక్ బస్టర్ . ఖైదీనంబర్ 150 చిత్రం `బాహుబలి` ఫస్ట్ డే కలెక్షన్స్ ను కొల్లగొడుతుంది. ఆ రికార్డులను `బాహుబలి-2` కొట్టొచ్చు. అమ్మడు కుమ్ముడు సాంగ్ లో చరణ్ కనిపించగానే థియేటర్ దద్దరిల్లిపోయింది. రైతు సమస్యలను హైలైట్ చేస్తూ చూపించిన ప్రతి సన్నివేశం మనసును హత్తుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో `ఖైదీనంబర్ 150` కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని నిర్మాత, `సంతోషం` అధినేత సురేష్ కోండేటి ఆనందం వ్యక్తం చేశారు.
You must be logged in to post a comment.