వంగవీటి రాధా కి నా బ్లాస్ట్ వార్నింగ్ –రామ్ గోపాల్ వర్మ

రంగాగారి క్యారెక్టర్ని వక్రీకరించానన్నా రాధా కామెంట్లకి నా సమాధానం

 

1. రంగా గారు బోసిపళ్ళ మహాత్మా గాంధీ అని చూపించాలా?

2. మర్డర్ల మాట అటుంచి ఎవర్ని మొట్టికాయ కూడా కొట్టలేదని చూపించాలా?

3. మదర్ థెరిస్సా కన్నా సాత్వికుడు అని చూపించాలా?

4. అన్న దానాలు,ప్రజా సేవ తప్ప చీమకైనా హాని చెయ్యని గౌతమ బుద్దుడని చూపించాలా? 

 

వాస్తవాలే చూపించాల్సిందన్న రాధా డిమాండ్లకి  నా సమాధానం-

 

రంగా గారి గురించి ఆయన భార్య గురించి, రంగా గారి అభిమానులు వినటానికి చూడటానికి ఇష్టపడని డాక్యుమెంటేడ్ వాస్తవాలు నేను చాలా చాలా చూపించగలను… కాని రంగా గారి
మీద వున్న గౌరవంతో అవి చూపించలేదు.

దమ్ముండి ఆ వాస్తవాలు ఏమిటని రాధా డిమాండ్ చేస్తే వాటన్నింటిని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా. 

నేను ముందునుంచి చెప్తున్నది వంగవీటి సినిమా తియ్యడంలో నా ఉద్దేశ్యం ఆ జీవిత కథల ఆధారంగా అప్పుడు జరిగిన ఆ సంఘటనల వెనుక వాళ్ళ సున్నితమైన భావోద్వేగాలని చూపించడం మాత్రమే.

 

ఒరిజినల్ వంగవీటి రాధా, వంగవీటి రంగా గార్లలో ఉన్నగొప్పతనంలో ఈ రాధాకి 0.1%లేకపోవడం మూలానే ఈ రాధా పరిస్థితి ఇలా వుంది ఏమి అర్ధం చేసుకోకుండా మాట్లాడుతున్నాడు.

వంగవీటి సినిమా గురించి దుర్భుద్ది ఉన్న వాళ్ళు నా దురుద్దేశ్యం గురించి ఎంత అరిచి గీ పెట్టినా ,పచ్చి నిజం ఏమిటంటే రంగా గారి మీద రాధాకి,రత్నకుమారిగారికి ఉన్న గౌరవం కన్నా ఎన్నో రెట్లు నాకెక్కువ గౌరవముంది. ఈ నిజం నిజాయితీగా గుండెల మీద చేయ్యేసుకున్న ప్రతి నిజమయిన రంగా అభిమానికి వాళ్ళ వాళ్ళ మనసుల్లో తెలుసు.

 

నేను తీసిన వంగవీటి సినిమా కరెక్ట్ కాదనుకుంటే రాధాని “అసలు వంగవీటి”అని ఇంకో సినిమా తీసి లోకానికి చూపించుకోమనండి.

 

ఇకపోతే నన్నేదో చేసేస్తానన్న రాధా ఇచ్చిన వార్నింగ్ కి నా కౌంటర్ వార్నింగ్.

 బస్తీ మే సవాల్–

సెంటర్ నేను చెప్పను- టైం నువ్వు చెప్పొద్దు.

About CineChitram

Check Also

ఇక్కడ సెన్సార్‌ చేయని సినిమాకి..అక్కడ ఒక్క కట్‌ లేకుండా సెన్సార్‌ అయ్యింది.

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading