ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అభిమానులందరికీ ఇదో వేడుక సమయం! ఎ.బి.సి. డిజిటల్ మీడియా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మొట్టమొదటిసారి ఓ గొప్ప ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుతో ఓ ఆండ్రాయిడ్ యాప్ ను, వెబ్ సైట్ ను (www.trivikramcelluloid.in) ఈ సంస్థ ప్రారంభిస్తోంది. కోట్లాది తెలుగు ప్రేక్షకుల అభిమాన దర్శకుడు త్రివిక్రమ్ పుట్టినరోజు (నవంబర్ 7) న ఈ కానుకను అందించబోతోంది. ఇక మీదట ఆయన అభిమానులంతా ఒకే ఒక్క క్లిక్ తో త్రివిక్రమ్ సినిమాలకు సంబంధించిన అన్ని రకాల తాజా విశేషాలను తెలుసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ను నవంబర్ 7 నుంచి ఎవరైనా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ యూజర్ ఫ్లెండ్లీ యాప్ ఇందులోని అప్ డేట్స్ అన్నింటినీ నోటిఫికేషన్ మెసేజ్ ద్వారా యూజర్స్ కు తెలియచేస్తుంది అని సంస్థ ప్రతినిధి రాహుల్ మీడియా కు తెలిపారు
About CineChitram
Related Articles
The Transformation Of Nadezhda Grishaeva From Basketball Sensation To Successful Entrepreneur
June 30, 2024
Казино стрим онлайн сейчас джокерпро стримы
June 28, 2024
Veera Dheera Sooran Part 2: Chiyaan Vikram’s Action Thriller Arrives March 27, 2025 | CineChitram
8 hours ago
ఏంటి అలా కనిపించబోతున్నాడా! | CineChitram
9 hours ago
బోయపాటి వేట అందుకే! | CineChitram
9 hours ago