అక్టోబర్ 1న అవికాగోర్ ‘మాంజ’

అవికాగోర్ హీరోయిన్ గా ఇషాడియోల్, కార్తిక్ జయరాజ్, అనీష్ బజ్మీ, దీప్ పథక్ ఇతర ప్రధాన పాత్రధారులుగా కిషన్ శ్రీకాంత్ దర్శకత్వంలో కన్నడలో ఘనవిజయం సాధించిన చిత్రాన్ని భీమవరం టాకీస్ పతాకంపై రాజ్ కందుకూరి సమర్పణలో తుమ్మలపల్లి రామసత్యనారాయణరావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న చిత్రం “మాంజ”. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 1న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ ప్రివ్యూ థియేటర్లో దర్శకరత్న డా:దాసరి నారాయణరావు సమక్షంలో జరిగింది. 

ఈ సందర్భంగా డా:దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. ‘డబ్బింగ్ సినిమాల ప్రభావం తెలుగు సినిమాల మీద పడి చిన్ని తెలుగు సినిమాలకు స్క్రీన్స్ లేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే నేను డబ్బింగ్ సినిమా ఫంక్షన్స్క కి రాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ కి వచ్చానంటే కారణం మాత్రం ఈ సినిమా డైరెక్టర్. 9సం. లకే డైరెక్ట్ చేశాడు. అందుకే అతన్ని ఆశీర్వదించడానికి వచ్చాను. నలుగురు కుర్రాళ్ళ కథే ఈ మాంజ. చిన్నప్పుడు గాలిపటాలు ఎగరేసేటప్పుడు వాడే మంజాను ఈ సినిమాలోని మూలకథకు ఏ విధంగా  ఉపయోగించాడు అన్న ఇతివృత్తంగా తీసుకుని సినిమాను చాల అద్భుతంగా తెరకెక్కించాడు. నిజంగా టేకింగ్ మెచ్యూర్డ్ డైరెక్టర్ డైరెక్ట్ చేసినట్టయింది. ఈ మధ్య అవికాగోర్ బాగా పాపులర్ అయింది. మంచి సినిమాలు చేస్తోంది. ఈ సినిమా కూడా తనకి మంచి సినిమా అవుతుందన్న నమ్మకముంది. సినిమాను ప్రమోషన్ చేసి విడుదల చేయడంలో రామసత్యనారాయణ రావు కి చక్కని అనుభవం ఉంది. అలాగే రాజ్ కందుకూరి, రామసత్యనారాయణరావు కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం వాళ్లతో పాటు యూనిట్ అందరూ మంచి విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణరావు.. ‘చిన్న సినిమా అయినప్పటికీ గురువుగారు దాసరిగారి ఆదరణతో మాలాంటి చిన్న నిర్మాతలు తీసే సినిమాలకు మంచి సపోర్ట్ దొరుకుతుంది. చక్కని కథాంశంతో మాస్ ఎంటెర్టైనెర్ గా ఈ సినిమా రూపొందిన “మాంజా” చిత్రాన్ని అక్టోబర్ 1న 65థియేటర్స్ లో విడుదల చేస్తున్నాం’ అన్నారు. 
చిత్రదర్శకుడు కిషన్ ఎస్ ఎస్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను ఎంతో ఎఫర్ట్ పెట్టి చేశాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘మాంజ’. అవికాగోర్ తెలుగులో బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా హేమామాలిని తనయ ఇషాడియోల్ రోల్ సినిమాకి హైలైట్. ఆ పాత్రకు జీవం పోశారు. ముగ్గురు కుర్రాళ్ళు, ఒక అమ్మాయి పోలిసులకు దొరికితే 18సం.ల లోపు వాళ్ళను ఎలా ట్రీట్ చేస్తారనేది ఈ చిత్రంలో చూపించాం.   అయితే పోలీసుల బారి నుండి తప్పించుకోవటానికి ‘మాంజ’ను ఏ విధంగా వినియోగించారు అనేది చిత్ర కథాంశం. తప్పకుండా మాకందరికి మంచి సినిమా అవుతుందన్న నమ్మకముంది’ అన్నారు. 
రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘సినిమాను చిన్నా-పెద్ద అన్న తేడా లేకుండా ప్రమోషన్ చేసి విడుదల చేయాలంటే రామసత్యనారాయణరావు గారికే సాధ్యం. అందుకే ఆయన చేసే ప్రతి సినిమా సక్సెస్ అవుతుంది. కిషన్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. వయసు తక్కువైనా ఏంతో అనుభవం ఉన్నవాడిలా చేసాడు. అతనికి ఈ సినిమా డైరెక్టర్ గా మంచి పేరు తెస్తుంది. టీం అందరూ ఈ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకుంటారు’ అన్నారు. 
ఇంకా ఈ కార్యక్రమంలో మల్కాపురం శివకుమార్, ఎన్.శంకర్, గిరిధర్, సాయివెంకట్, పద్మిని, కె.ఆర్.ఫణిరాజ్, కిషన్ ఎస్ ఎస్, దీప్ పథక్, పాటల  రచయితలు చల్లా భాగ్యలక్ష్మి, సురేష్ గంగుల, మాటల రచయిత చంద్ర వట్టికూటిలు పాల్గొన్నారు. 
అవికాగోర్, ఈషా డియోల్(హేమమాలిని కుమార్తె), కార్తీక్ జయరాజ్, అనీష్ బజ్మీ, దీప్ పథక్, నరేష్ డింగ్రి నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: చల్ల భాగ్యలక్ష్మీ, సురేష్ గంగుల, మాటలు: చంద్ర వట్టికూటి, పీఆర్ ఓ: ధీరజ్ అప్పాజీ, సమర్పణ: రాజ్ కందుకూరి, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం: కిషన్ శ్రీకాంత్.  
 

About CineChitram

Check Also

`గ‌జేంద్రుడు` ఆర్య కెరీర్‌లోనే టర్నింగ్ పాయింట్ మూవీ అవుతుంది – ఆర్‌.బి.చౌద‌రి

Leave a Reply

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading